Navneet Kaur: టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నవనీత్‌ కౌర్. వివాహం తర్వాత ఆమె పూర్తిగా పాలిటిక్స్‌కు పరిమితం అయిపోయారు. మహారాష్ట్ర ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే రవిరానాను పెళ్లి చేసుకొని నవనీత్‌ రానాగా పేరు మార్చుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర రాష్ట్రంలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. లోక్‌సభలో ఎంపీ నవనీత్‌ కౌర్ పలుమార్లు తెలుగులో ప్రసంగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గత కొంతకాలంగా మహారాష్ట్ర పాలిటిక్స్‌లో రవిరానా దంపతుల పేర్లు తరచూ వినపడుతున్నాయి. 2021 నవంబర్‌లో త్రిపురలో జరిగిన గోడవల ప్రభావం అమరావతిలోనూ కనిపించింది. రవిరానా దంపతులు ప్రతిష్ఠించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అమరావతి మున్సిపల్‌ అధికారులు తొలగించడంతో వివాదస్పదమైంది. ఛత్రపతి విగ్రహ ఆవిష్కరణ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు ఎంపీ నవనీత్‌కౌర్. గత కొద్దిరోజులుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను తలపడుతూ ఉండడంతో మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. శివసేనకు నవనీత్‌ కౌర్‌కు గొడవేంటని తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత ఆసక్తి చూపుతున్నారు. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే నివాసంకు వచ్చి నిరసన చేపడతామని ఆమె హెచ్చరించడం తొలిసారి ఏం కాదు.. 2020 దీపావళి సమయంలో విదర్భకు చెందిన అన్నదాతలతో కలిసి సీఎం ఉద్దవ్‌ ఠాక్రే నివాసం ఎదుట ఆందోళన చేపడతామని చెప్పారామె.


మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్‌ ఠాక్రే బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో భయానక వాతావరణం పెరిగిపోయిందని ఆరోపించారు. ఎంపీ నవనీత్‌ కౌర్. ఈ నేపథ్యంలోనే హనుమాన్‌ జయంతి నాడు సీఎం ఉద్దవ్‌ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్‌ చాలీసా చదవాలని తాను డిమాండ్‌ చేస్తున్నానని..కానీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే ఆ పని చేయలేరని ఎంపీ నవనీత్‌ కౌర్‌ విమర్శించారు. హనుమాన్‌ చాలిసా చదివితే ఆయన పార్టీలోని కొన్ని కూటములు బయటకు వెళ్లిపోతాయని ఆమె అన్నారు. పోలీసులు నవనీత్‌కు నోటిసులు ఇస్తూ..రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించే చర్యలు చేపట్టవద్దని పోలీసులు తెలిపారు.



మహారాష్ట్రలో శాంతి భద్రతలకు చెడగొట్టేందుకే నవనీత్‌ యత్నిస్తున్నారని శివసేన తీవ్రస్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతల పోద్బలంతోనే నవనీత్‌ దంపతులు అలా వ్యవహరిస్తున్నారని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో నవనీత్‌ కౌర్‌కు బీజేపీ సర్కార్‌ వీఐపీ భద్రతను కేటాయించింది. నవనీత్‌ దంపతులకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలతో భారీ భద్రత ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. నవనీత్‌ కౌర్‌కు నలుగురు CISF కమాండోలు భద్రత కల్పించనున్నారు. ఎంపీ నవనీత్‌ కౌర్‌ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే నివాసం వద్దకు వెళ్లి హనుమాన్‌ చాలిసా చదువుతారో లేదో వేచి చూడాలి. శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా మహారాష్ట్రలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Also Read: Cheating Case: అతనికి 50.. ఆమెకు 25... వలపు వల విసిరి టెక్కీని బోల్తా కొట్టించిన యువతి..
Also Read: Prashanth Kishor Strategy: కాంగ్రెస్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.