Cheating Case: అతనికి 50.. ఆమెకు 25... వలపు వల విసిరి టెక్కీని బోల్తా కొట్టించిన యువతి..

Hyderabd Man Cheated by a Girl: అతని వయసు 50.. ఆమె వయసు 25... ఇద్దరి మధ్య వయసులో 25 ఏళ్ల తేడా... అయినా సరే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని అతన్ని నమ్మించింది. చివరకు కుచ్చు టోపీ పెట్టింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 10:35 AM IST
  • 50 ఏళ్ల వ్యక్తిని బురిడీ కొట్టించిన 25 ఏళ్ల యువతి
  • పెళ్లి పేరుతో యువతి మోసం
  • రూ.46 లక్షలు కాజేసిన యువతి
 Cheating Case: అతనికి 50.. ఆమెకు 25... వలపు వల విసిరి టెక్కీని బోల్తా కొట్టించిన యువతి..

Hyderabd Man Cheated by a Girl: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువతి బురిడీ కొట్టించింది. రెండో పెళ్లి కోసం చూస్తున్న ఆ వ్యక్తిపై వలపు వల విసిరింది. మీరంటే ఇష్టమని... వయసులో చాలా తేడా ఉన్నా సరే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. యువతి మాటలకు కరిగిపోయిన అతను ఆమె వలలో పడిపోయాడు. ఆపై సదరు వ్యక్తి నుంచి ఆ యువతి రూ. 46 లక్షల వరకు కాజేసింది. 

వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కి చెందిన ఓ వ్యక్తి (50) నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండో పెళ్లి కోసం చూస్తున్న అతను... ఇటీవల మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు. ఆ మరుసటిరోజే ఓ అందమైన యువతి (25) అతని ఫేస్‌బుక్ ఖాతాకు రిక్వెస్ట్ పెట్టింది. తన పేరు చెప్పి.. తాను ఇంజనీరింగ్ చదువుతున్నానని పరిచయం చేసుకుంది.

మ్యాట్రిమోనియల్ సైట్‌లో మీ ప్రొఫైల్ చూశానని... మీరు నచ్చారని అతనితో చెప్పింది. వయసులో చాలా తేడా ఉన్నా సరే... మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కవ్వింపు మాటలతో కరగదీసింది. యువతి మాటలు నిజమేనని నమ్మిన అతను ఆమెతో ప్రేమలో పడ్డాడు. అలా ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, చాటింగ్స్ నడిచాయి.

ఇదే క్రమంలో ఓరోజు సడెన్‌గా ఫోన్ చేసి..  కోవిడ్‌తో తాను ఆసుపత్రిలో చేరినట్లు చెప్పింది. ట్రీట్‌మెంట్ కోసం రూ.10 లక్షలు అవసరమని చెప్పింది. యువతి కోరడమే ఆలస్యం ఆమెకు అడిగినంత డబ్బులు ఇచ్చేశాడు ఆ వ్యక్తి. ఇదే అదనుగా అతని నుంచి పలుమార్లు ఆ యువతి రూ.46 లక్షలు మేర కాజేసింది. ఇంత జరిగాక కానీ అతనికి తాను మోసపోయానని తెలియలేదు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Truecaller Call Recording: Truecaller వినియోగదారులకు గమనిక.. ఇకపై యాప్ లో ఆ ఫీచర్ పనిచేయదు!

Also Read: Acharya Pre Release Event: మెగా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్... 'ఆచార్య' ఈవెంట్‌కు దూరంగా పవన్ కల్యాణ్... కారణమిదే...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News