NGLV Rocket: ఇస్రో నుంచి కొత్త రాకెట్, ఇక మనుషుల్నీ మోసుకెళ్తుంది
NGLV Rocket: అంతరిక్షంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కొత్తగా న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీ ప్రారంభించిం ఈ కొత్త రాకెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
NGLV Rocket: ఇస్రో కొత్తగా న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అంటే ఎన్‌జీఎల్‌వి తయారీకు సిద్ధమైంది. ఇప్పటివరకూ ఇస్రో తయారు చేసిన వివిథ లాంచ్ వెహికల్ రాకెట్లకు ఇది చాలా ప్రత్యేకం కానుంది. మనుషుల్ని సైతం అంతరిక్షంలో క్షేమంగా తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే విధంగా ఈ రాకెట్ రూపకల్పన జరగనుంది.
ఇస్రో ఇప్పటి వరకూ 40 నుంచి 5000 కిలోల బరువున్న ఉపగ్రహాల్ని అంతరిక్షంలో తీసుకెళ్లగలిగే ఎస్ఎల్‌వి, ఏఎస్ఎల్‌వి, పీఎస్‌ఎల్‌వి, జీఎస్‌ఎల్‌వి, ఎల్‌వీఎం 3, ఎస్ఎస్‌ఎల్‌వి రాకెట్లను తయారు చేసింది. ఇప్పుడు త్వరలో మానవ సహిత ప్రయోగంతో మనుషుల్ని అంతరిక్షంలో మోసుకెళ్లే రాకెట్ తయారీ ప్రారంభించింది. ఈ కొత్త న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ ద్వారా 20 వేల కిలోల బరువుండే ఉపగ్రహాల్ని కూడా భూమికి సమీపంలోని లియో ఆర్బిట్‌లోనూ, 10 వేల కిలోల బరువుండే ఉపగ్రహాల్ని జీటీఓ ఆర్బిట్‌లోనూ ప్రవేశపెట్టవచ్చు. ఇస్రో ఈ కొత్త ప్రాజెక్టుకు 1798 కోట్లు ఖర్చు చేయనుంది. 2028 నాటికి ప్రయోగాత్మకంగా పరీక్ష ఉంటుంది. 2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చు.
ఇస్రో చేపట్టిన న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ఎత్తు 75 మీటర్లు ఉంటుంది. వెడల్పు 5 మీటర్లుగా ఉంది. ఇందులో కూడా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ఓ దశలో 160 టన్నుల సెమీ క్రయోజనిక్ ఇంధనం వినియోగిస్తారు. మరోవైపు శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదిక నిర్మించేందుకు ఇస్రో సిద్ధమౌతోంది. ప్రస్తతం ఇక్కడ రెండు ప్రయోగ వేదికలు, 4 వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగులు ఉన్నాయి. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ నిర్మాణం విజయవంతమైతే మానవ సహిత ప్రయోగాలు ఊపందుకుంటాయి.
Also read: Rain Alert: పశ్చిమ హిమాలయాల్లో వెస్టర్న్ డిస్ట్రబెన్స్, ఉత్తరాదిన మోస్తరు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook