Mission Gaganyaan: చంద్రయాన్ 3 విజయవంతం తరువాత ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 మిషన్ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడు ఇస్రో అంతరిక్షంలో మనుషుల్ని పంపించనుంది. మిషన్ గగన్ యాన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్‌ను ఇస్రో విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇస్రో త్వరలో చేపట్టనున్న మిషన్ గగన్ యాన్‌కు సంబంధించి కీలకమైన పరీక్షలు త్వరలో జరగనున్నాయి. ఇది మానవ సహిత మిషన్. ఈ మిషన్‌కు సంబంధించిన ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 కోసం ఇప్పుడు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరు గురించి కీలకమైన సమాచారాన్నిఅందించే వ్యవస్త ఇది. అంటే అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వ్యోమగాముల్ని సురక్షితంగా భూమికి చేర్చే వ్యవస్థ ఇది. ఈ పరీక్ష సక్సెస్ అయితే గగన్ యాన్‌లో కీలకమైన ప్రక్రియ పూర్తయినట్టే.


ఈ పరిస్థితుల్లో రాకెట్ నుంచి విడివడిన క్రూ మాడ్యూల్ పారాచూట్ల సహాయంతో బంగాళాఖాతంలో దిగుతుంది. వ్యోమగాముల రక్షణకై ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరుని శాస్త్రవేత్తలు సేకరిస్తారు. టెస్ట్ వెహికర్ టీవీ డీ1 అనేది అబార్ట్ మిషన్ కోసం ఉద్దేశించిన ఒకే దశ లిక్విడ్ రాకెట్. మావవ సహిత ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేసెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. గగన్ యాన్ మిషన్ సమయంలో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ భూమి నుంచి 17 కిలోమీటర్ల ఎత్తులో విడిపోతుంది. బంగాళాఖాతంలో తాకిన తరువాత ఈ క్రూ మాడ్యూల్‌ను భారత నావికా దళానికి చెందిన ప్రత్యేక నౌక తీసుకొస్తుంది. 


గగన్ యాన్ మిషన్‌లో ఇద్దరు  ముగ్గురు వ్యక్తుల్ని 1-3 రోజుల మిషన్ కోసం భూమి చుట్టూ 400 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురానున్నారు. 


Also read: Chandrayaan 3: చంద్రయాన్ 3 కధ ముగిసిందా, రాత్రి ప్రారంభంతో ఆశలు వదులుకున్న ఇస్రో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook