Chandrayaan 3: చంద్రయాన్ 3 కధ ముగిసిందా, రాత్రి ప్రారంభంతో ఆశలు వదులుకున్న ఇస్రో

Chandrayaan 3: ప్రపంచం మొత్తం గర్వించిన ఇస్రో విజయం చంద్రయాన్ 3 కధ ముగిసినట్టే కన్పిస్తోంది. చంద్రునిపై చీకటితో నిద్రావస్థలో వెళ్లిన విక్రమ్ ల్యాండర్ తిరిగి మేల్కొనలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 7, 2023, 11:21 AM IST
Chandrayaan 3: చంద్రయాన్ 3 కధ ముగిసిందా, రాత్రి ప్రారంభంతో ఆశలు వదులుకున్న ఇస్రో

Chandrayaan 3: ఇస్రో విజయవంతంగా చంద్రునిపై ప్రయోగించిన చంద్రయాన్ 3 విషయంలో గత కొద్దికాలంగా ఇస్రోకు చాలా ఆందోళనగా ఉంది. ప్రపంచం మొత్తం గర్వించిన చంద్రయాన్ 3 కధ 14 రోజులకే ముగిసిపోయింది. ఇక ఇస్రో ఆశలు కూడా వదులుకున్నట్టే కన్పిస్తోంది. 

ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 విషయంలో గత 14 రోజులుగా ఇస్రో శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆగస్టు 23 సాయంత్రం చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టిన ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లు 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేశాయి. 14 రోజులకు చంద్రునిపై చీకటి అంటే రాత్రి ప్రారంభం కావడంతో విక్రమ్ ల్యాండర్‌ను నిద్రావస్థలోకి పంపించారు. ఆ తరువాత 14 రోజుల రాత్రి తరువాత తిరిగి చంద్రునిపై పగలు ప్రారంభం కాగానే విక్రమ్ ల్యాండర్‌ను మేల్కొల్పేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. 

చంద్రునిపై రాత్రి వేళ ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీలకు కూడా పడిపోతుంటుంది. ఈ క్రమంలో తిరిగి పనిచేయడం కష్టమే. ఫలితంగా ఇస్రో ప్రయత్నాలు విఫలమౌతూవచ్చాయి. తిరిగి యాక్టివేట్ చేసేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలే చేసింది. 14 రోజులపాటు పేలోడ్స్ యాక్టివ్ మోడ్ కోసం ప్రయత్నించారు. కానీ ఏ ప్రయత్నం సఫలం కాలేదు. చంద్రునిపై సూర్య కాంతి ప్రసరణ సరిగ్గా లేకపోవడంతో ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లో అమర్చిన సోలార్ బ్యాటరీలు డెడ్ అయ్యాయి.

రోజూ వాటిని యాక్టివేట్ చేసే ప్రయత్నాల్లో మళ్లీ 14 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ చంద్రునిపై రాత్రి ప్రారంభమైందియ మరో 14 రోజులు ఇలాగే ఉంటుంది. అంటే చంద్రయాన్ చంద్రునిపై అడుగెట్టిన తరువాత రెండవసారి చీకటి కానుంది. చంద్రునిపై 24 గంటలంటే 28 రోజులతో సమానం. అంటే పగలు 14 రోజులు, రాత్రి 14 రోజులుంటుంది. అంటే మరో 14 రోజులు చంద్రునిపై సూర్య కాంతి ప్రసరించదు. 

ఈ 14 రోజుల్లో చంద్రుని దక్షిణ ధృవంపై మైనస్ 200 డిగ్రీలు దాటుతుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే పనిచేయని విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లు ఇక పూర్తిగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోతాయి. అంటే ఇక అవి పనిచేసే అవకాశాలు పూర్తిగా పోయినట్టే. అందుకే ఇస్రో అన్ని ఆశలు వదిలేసుకుంది.

Also read: Weather Forecast: తరలిపోతున్న రుతుపవనాలు, ఇక వర్షాలు లేనట్టే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News