భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ISRO ) మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లోని శ్రీహరికోట నుంచి రేపు మధ్యాహ్నం పీఎస్ఎల్‌వీ  సీ 49 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఏకంగా పది ఉపగ్రహాల్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇస్రో..భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఏపీలోని శ్రీహరికోట ( Sriharikota ) ఇప్పుడు మరో ప్రయోగానికి వేదిక కానుంది. రేపు మధ్యాహ్నం అంటే శనివారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు చారిత్మాత్మక ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. ఈ ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పీఎస్ఎల్‌వీ సీ 49 ( PSLV C 49 Rocket ) రాకెట్‌ను ప్రయోగిస్తూ..ఇదే రాకెట్ ద్వారా ఏకంగా 10 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఈఓఎస్-01 ( EOS-01 ) పేరుతో ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో పాటు...9 విదేశీ శాటిలైట్లను సీ 49 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. 


ఇవాళ ఇస్రో ఛైర్మన్ ( Isro Chairman ), ఇతర శాస్త్రవేత్తలు శ్రీహరికోట షార్ సెంటర్‌కు ( Shar centre ) చేరుకోగానే..మధ్యాహ్నం 1 గంట 2 నిమిషాలకు దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ( Count down ) మొదలైంది. ఈ సందర్భంగా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో శాస్త్రవేత్తలు మినహా మరెవ్వరినీ అనుమతించలేదు. పీఎస్ఎల్‌వీ సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా..షార్ సెంటర్ నుంచి ఓవరాల్‌గా 76వ ప్రయోగం. 


రాకెట్ ప్రయోగం నేపధ్యంలో ఇవాళ నమూనా రాకెట్‌కు తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో ఇస్త్రో శాస్త్రవేత్తల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాల్ని అధ్యయనం చేసేందుకు వీలుగా సరికొత్తగా రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని మార్చ్ 12న నిర్వహించాలనుకున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ ( Corona lockdown ) కారణంగా వాయిదా వేసి..రేపు ప్రయోగించనున్నారు. Also read: CCMB Warning: కరోనా వేవ్‌లు వస్తూనే ఉంటాయి..తస్మాత్ జాగ్రత్త