PM Modi meets Jhunjhunwala: ఇండియన్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman‌)తో భేటీ అవ్వడం..సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వీరి భేటీ వెనుక అంతర్యం ఏంటనే విషయం అర్థం కావడం లేదు. స్టాక్ మార్కెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రాకేష్ ఝున్‌ఝున్‌ వాలా. మార్కెట్‌ వ్యవహరాలు తప్పితే పెద్దగా ఇతర విషయాల్లో నేరుగా తల దూర్చని రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా(Rakesh Jhunjhunwala) తన శైలికి భిన్నంగా నేతలను కలవడం ఇప్పడు  చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఝున్‌ఝున్‌వాలాను కలిసిన తర్వాత ఓ ట్వీట్(Tweet) చేశారు ప్రధాని మోడీ(PM Modi). వారితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంపాటు ఓ ఆసక్తికర కామెంట్‌(Comment)ను ప్రధాని జోడించారు. 'అంతర్దృష్టి ఉన్న వ్యక్తిని, అత్యంత చురుకైన వ్యక్తిని కలిశానంటూ'’ తన ట్విటర్‌లో రాసుకొచ్చారు. వీరి భేటీలో భారత షేర్ మార్కెట్ బిగ్ బుల్‌గా పిలుచుకునే ఝున్‌ఝున్‌వాలా నలిగిన చొక్కాతో చాలా సాదాసీదాగా కనిపించారు. ఇక ఝున్‌ఝున్‌వాలా కుర్చీలో కూర్చోగా.. తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ ఎదురుగా వినయంగా చేతులు కట్టుకుని ఉన్న మోదీ ఫొటో మరొకటి ట్విటర్‌లో షేర్‌ అయ్యాయి. 



Also read: Elon Musk: ఎలన్‌ మస్క్‌కి సొంత కంపెనీ నుంచే భారీ షాక్‌, మస్క్‌కు రూ.70 వేల కోట్లదాకా జరిమానా విధించే అవకాశం


రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా త్వరలో ఆకాశ పేరుతో ఎయిర్‌లైన్స్‌(Akasa Airlines) సేవలు ప్రారంభించే యోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సహాకారం కోరేందుకు వచ్చి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక బిగ్‌బుల్‌(Big Bull) ఇచ్చే మార్కెట్‌ సూచనల కోసం దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. విదేశీ మార్కెట్ల కంటే స్వదేశీ మార్కెట్ల ద్వారానే ఎక్కువ లాభపడవచ్చంటూ ఆయన తరచుగా ఔత్సాహిక ఇన్వెస్టర్లకు సలహా ఇస్తుంటారు. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ ఇండియా రిచ్‌ జాబితాలో రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అండ్‌ ఫ్యామిలీ ఆస్తుల విలువ 22,300 కోట్ల రూపాయలుగా ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook