Jaipur Road Accident: రాజస్థాన్ జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఢిల్లీ నుంచి గుజరాత్‌కు నిందితుడిని తీసుకెళ్తున్న పోలీసు వాహనం జైపూర్‌లోని భబ్రూ ప్రాంతంలో (Bhabroo area) అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పోలీసులు ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదంలో మరణించిన పోలీసులందరూ గుజరాత్ పోలీసులకు (Gujarat Police personnel) చెందినవారే. భబ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింజర్ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు తుక్కుతుక్కు అయ్యింది.  ప్రమాద సమాచారంతో పోలీసు శాఖలో భయాందోళన నెలకొంది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ (Ashok Gehlot) సంతాపం ప్రకటించారు. మృతులు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 


ప్రమాదంపై సమాచారం అందుకున్న భబ్రూ పోలీసులు (Bhabroo Police) సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని సమాచారం. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై బబ్రూ పోలీసులు గుజరాత్ పోలీసులకు సమాచారం అందించారు. 


Also Read: Hijab Row: హిజాబ్ లేకపోవడం వల్లనే దేశంలో అత్యాచారాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook