Jalebi Not Worked In Haryana: తప్పక విజయం సాధించాల్సిన హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ బోల్తా కొట్టింది. విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌ను హర్యానా ఓటర్లు తీరని నిరాశ మిగిల్చారు. ఆరంభంలో అదిరేలా కౌంటింగ్‌ సరళి రాగా ఫలితాలు ముగిసే సమయానికి ఫలితాలు తారుమారయ్యాయి. తీరా విజయం పోయి అత్తెసరు సీట్లతో కాంగ్రెస్‌ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఘోర పరాభవానికి కారణాలు ఏమిటనే దానిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ నాయకత్వ లోపం కాంగ్రెస్‌ను ముంచేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ట్రెండింగ్‌లోకి జిలేబీ స్వీటు, జాట్ల వర్గం వచ్చాయి. ముఖ్యంగా రాహుల్‌ చేసిన జిలేబీ వ్యాఖ్యలు ఎన్నికల్లో పని చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rahul Gandhi: చెదురుతున్న రాహుల్‌ గాంధీ కల.. తాజా ఫలితాలతో ప్రధానమంత్రి ఆశలు ఆవిరి?


ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ చేసిన 'జిలేబీ' వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 'హర్యానా అంటేనే జిలేబీ గుర్తుకు వస్తుంది. గోహనా కూడా జిలేబీకి ప్రసిద్ధి. జిలేబీని పెద్ద ఎత్తున తయారుచేసి ఎగుమతి చేయాలి' అంటూ రాహుల్‌ గాంధీ ప్రచారం చేశారు. హర్యానాలో జిలేబీ వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన మథురామ్‌ గుప్తాను కలిసి రాహుల్‌ జిలేబీ విషయమై ప్రధానంగా మాట్లాడారు. ఆ క్రమంలోనే రాహుల్‌కు మథురామ్‌ జిలేబీ తయారీ విశేషాలతోపాటు తన వ్యాపారాన్ని వివరించాడు. 'నోట్ల రద్దు సమయంలో జిలేబీ వ్యాపారం తీవ్రంగా నష్టపోయాం' అని చెప్పారు. అనంతరం రాహుల్‌ మాట్లాడుతూ.. 'నాథురామ్‌ వంటి వారు తయారుచేసే జిలేబీలను దేశవ్యాప్తంగా విక్రయించి ఎగుమతి చేయాలి. ఇలా చేయడంతో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి' అని వ్యాఖ్యానించారు.


Also Read: Vinesh Phogat: ఒలింపిక్స్‌ మెడల్‌ పోయినా ఎమ్మెల్యేగా విజయం.. కసి తీర్చుకున్న వినేశ్ ఫొగాట్


జాట్లు, జిలేబీని అస్త్రంగా చేసుకుని రాహుల్‌ చేసిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. ఈ వ్యాఖ్యలతో తప్పక గెలుస్తామని కాంగ్రెస్‌ శ్రేణులు విశ్వాసంతో మునిగారు. అయితే ఎన్నికల ప్రచారంలో జిలేబీ, జాట్ల వ్యాఖ్యలకు మంచి స్పందన కనిపించినా ఓట్లను మాత్రం రాల్చలేకపోయింది. వరుసగా మూడోసారి కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేకపోయింది. ప్రచారంలో రాహుల్‌ చేసిన జిలేబీ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టడంలో విజయవంతమైంది. దాని ఫలితమే వరుసగా కాషాయ పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధించడంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఫలితాలు వెలువడిన అనంతరం బీజేపీ వ్యంగ్యంగా తిప్పికొట్టింది. గెలిచిన అనంతరం పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు జిలేబీలు భారీగా ఆర్డర్‌ ఇచ్చి పంచుకుని సంబరాలు చేసుకున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి