Vinesh Phogat: ఒలింపిక్స్‌ మెడల్‌ పోయినా ఎమ్మెల్యేగా విజయం.. కసి తీర్చుకున్న వినేశ్ ఫొగాట్

Vinesh Phogat Wins Julana Assembly: పారిస్‌ ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్‌ ఫొగట్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి విజయం సాధించడం విశేషం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 8, 2024, 01:28 PM IST
Vinesh Phogat: ఒలింపిక్స్‌ మెడల్‌ పోయినా ఎమ్మెల్యేగా విజయం.. కసి తీర్చుకున్న వినేశ్ ఫొగాట్

MLA Vinesh Phogat: విశ్వక్రీడల్లో ఊహించని రీతిలో పతకం అందుకోకుండా నిరాశతో స్వదేశం చేరిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కసి తీర్చుకున్నారు. స్వదేశంలో తనకు ఎదురైన పరాభవంపై పూర్తిగా కసి తీర్చుకున్న ఆమె రాజకీయంగా విజయం సాధించారు. హర్యానా ఎన్నికల్లో వెలువడిన ఫలితాల్లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందారు. పతకం దక్కకపోయినా ఎమ్మెల్యే పదవిని అలంకరించారు. పతకాన్ని కోల్పోయిన వినేశ్‌కు జులానా ప్రజలు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు.

Also Read: Amaravati ORR: చంద్రబాబు డిమాండ్లకు మోదీ జీ హుజుర్‌.. ఢిల్లీలో ఉండగానే అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు!

 

పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్‌ విభాగంలో తలపడిన వినేశ్‌ ఫొగట్‌ తుది పోరులో తలపడాల్సిన సమయంలో అనూహ్యంగా అధిక బరువు కారణంగా ఆమె పోటీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అనంతరం స్వదేశం చేరుకున్న వినేశ్ ఫొగట్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వినేశ్ ఫొగట్‌ పోటీ చేశారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసిన ఆమెకు ఓటర్లు బ్రహ్మారథం పట్టారు.

Also Read: Assembly Elections Results 2024 Live: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్.. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి హవా

 

తొలి ఎన్నికల్లోనే పోటీ చేసి వినేశ్‌ ఫొగల్‌ విజయం సాధించడం విశేషం. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా ఆమె గెలవడం గమనార్హం. ఒలింపిక్స్‌లో వెంటాడిన దురదృష్టం రాజకీయాల్లో అదృష్టంగా మారింది. ఫలితాల్లో మొదటి రౌండ్‌ నుంచి వినేశ్‌ ఫొగట్‌ ఆధిక్యం కనబరుస్తున్నారు. మధ్యలో కొంత వెనుకబడినా తర్వాత పుంజుకుని చివరి రౌండ్‌ వరకు వినేశ్‌ ఆధిక్యం కొనసాగించారు. బీజేపీ తరఫున యోగేశ్‌ బజ్‌రంగీ పోటీ చేయగా.. అతడిపై వినేశ్ ఫొగట్‌ సునాయాసంగా విజయం సాధించారు.

సంబరాలు
రెజ్లింగ్‌లో పరిస్థితుల కారణంగా విజయం సాధించలేకపోయిన వినేశ్‌ ఫొగట్‌ను జులానా ప్రజలు ఆదరించారు. ఒలింపిక్స్‌లో మెడల్‌ను కోల్పోయిన వినేశ్‌కు ఎమ్మెల్యే పదవి ఇచ్చి గౌరవించారు. కాగా రెజ్లింగ్‌లో రాజకీయంగా తీవ్ర అవమానాలు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న వినేశ్‌ ఫొగట్‌ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం అందరికీ షాకింగ్‌గా ఉంది. అయితే ఎమ్మెల్యేగా వినేశ్‌ ఫొగట్‌ విజయం సాధించినా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆమె కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగనున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే వినేశ్‌ మంత్రి అయ్యే అవకాశం కూడా ఉండేది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News