6 ITBP personnel dead in Jammu and Kashmir Army Bus Accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పహల్‌గామ్‌ ప్రాంతంలో భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తోన్న ఓ ఆర్మీ బస్సు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు అక్కడిక్కడే మృతిచెందారు. మరోవైపు పలువురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది చందన్‌ వారీ నుంచి పహల్‌గామ్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదం సమయంలో బస్సులో 37 మంది ఇండో-టిబెటెన్‌ బోర్డర్‌ పోలీసులు (ఐటీబీపీ), ఇద్దరు జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఉన్నారు. అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉన్న ఐటీబీపీ పోలీసులు.. చందన్‌ వారీ నుంచి పహల్‌గామ్‌ వెళ్తుండగా బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అయింది. డ్రైవర్ అదుపుచేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. బస్సు రోడ్డు మీద నుంచి నదిలో పడిపోయింది. 



ఈ బస్సు ప్రమాదంలో ఆరుగురు సైనికులు మృతి చెందాడు. పలువురు బోర్డర్‌ పోలీసులు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఎయిర్‌ అంబులెన్స్‌ల్లో శ్రీనగర్‌కు తరలించారు. అక్కడ అందరికీ చికిత్స జరుగుతోంది. 


Also Read: ఒకరు భారత్‌లో, మరొకరు పాకిస్తాన్‌లో.. 75 ఏళ్ల తర్వాత కలిసిన అన్నదమ్ములు! హృదయాలను పిండేసే దృశ్యం  


Also Read: Raksha Panchami 2022: రక్షా బంధన్ రోజున సోదరులకు రాఖీ కట్టలేకపోతే.. ఈ రోజు కట్టొచ్చు ఇది మీకు తెలుసా.?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.