Jammu Kashmir Elections: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 7 జిల్లాలోని 24 స్థానాలకు ఎన్నికల జరగుతున్నాయి. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్ లో అక్కడ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు దశాబ్దం తర్వాత అక్కడ ప్రజలు ముఖ్యమంత్రి ఎన్నిక కోసం ఓటు వేస్తున్నారు. మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో 16 సీట్లు కశ్మీర్ లో ఉన్నాయి. మరో జమ్మూలో మరో 8 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్ లో మొత్తం 90 స్థానాలకు గాను కశ్మీర్ లోయలో 47 సీట్లు.. జమ్మూలో 43 సీట్లు ఉన్నాయి. మొత్తంగా అక్కడ 3 దశల్లో ఎన్నికలు జరగుతున్నాయి. సెప్టెంబర్ 25న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 1న మూడో విడతా  పోలింగ్ తో జమ్మూ కశ్మీర్ లో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఎలక్షన్స్ రిజల్ట్ ను అక్టోబర్ 8న వెల్లడించనున్నారు.


జమ్మూ కశ్మీర్ లో తొలి దశలో భాగంగా జమ్మూ, ఉదంపూర్, ఢిల్లీలో ఏర్పాటు చేసిన 24 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లలో 35,500 మంది విదేశీ కశ్మీరీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రోజు జరగుతున్న ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ప్రజా స్వామ్యాన్ని పటిష్ఠ పరచాలని కోరారు. అంతేకాదు యువకులు, యువతులు, కొత్తగా ఓటర్లుగా నమోదు అయిన వారు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలాని ప్రధాన మంత్రి నరేంద్ మోడీ  విజ్ఞప్తి చేశారు.   



ఎన్నికల కమిసన్ తెలిపిన వివరాల ప్రకారం తొలి దశలో మొత్తంగా 23,27,580 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 11,76,462 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 11,51,058 మంది ఉన్నట్టు తెలిపింది. వీరిద్దరే కాకుండా ట్రాన్స్ జెండర్స్ దాదాపు 60 మంది ఉన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదు అయిన వారిలో 1.23 లక్షల మంది ఉన్నట్టు తెలిపింది. మరోవైపు దివ్యాంగులు 28.309 మంది, 85 యేళ్లు పై పడిన వారు 15,774 మంది ఉన్నారు.  


2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో జారుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు.  మొత్తంగా 24 స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 219 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయి. జమ్మూ రీజియన్ లో బీజేపీ పోటీ పడుతుండగా.. కాశ్మీర్ రీజియన్ లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇంజినీర్ రషీద్ సహా పలువురు ఇండిపెండెంట్స్ గా బరిలో నిలిచారు.  ఈ సారి జమ్మూ కశ్మీర్  ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు యేడేసి చొప్పున మొత్తంగా దాదాపు 14 సీట్లు రిజర్వ్ చేశారు. అటు 24 సీట్లు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ కు రిజర్వ్ చేశారు.


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.