Jammu Kashmir assembly video: జమ్ము అసెంబ్లీని 370ఆర్టికల్ వివాదం కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా.. ఎన్సీ నేతలు పట్టుపడుతున్నట్లు తెలుస్తొంది. మళ్లీ 370 అధికరణు పునరుద్దరించాలని కూడా అసెంబ్లీలో ఫకార్డులు పట్టుకుని మరీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 370 ఆర్టీకల్ మళ్లీ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తుందని చెప్పుకొవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో  మోదీ సర్కారు..  2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో జమ్ముకున్న ప్రత్యేక ప్రతిపత్తి అధికారాలు రద్దు చేయబడ్డాయి. ఆ తర్వాత అక్టోబర్ 31న జమ్మూ కశ్మీర్, లడక్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. 


 




 


ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఆ తర్వాత దాదాపుగా... పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో కూడా కొన్నిచదురు మదురు సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ.. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని JKNC అక్టోబర్ 16న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


ఇదిలా ఉండగా..జమ్ము డిప్యూటీ సీఎం సురీందర్ సింగ్ చౌదరీ.. జమ్ము ప్రజలకు ఆర్టికల్ 370 ఒక గొప్ప సెఫ్టీవాల్ గా నిలుస్తొందని తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపైన చర్చలు ప్రారంభించాలని కోరినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ మూడు రోజుల నుంచి కూడా జమ్ము సభలో.. 370ఆర్టికల్ మీద రచ్చ నడుస్తొంది. నేతలు ఒకర్ని మరోకరు కాలర్ లు పట్టుకుని తోపులాటలకు పాల్పడ్డారు. అంతే కాకుండా.. స్పీకర్ వెల్ లోనికి చొరపడేందుకు ప్రయత్నాలు చేశారు. అంతే కాకుండా.. ఫ్లకార్డులు పట్టుకుని గట్టిగా నినాదాలు చేస్తు నిరసనలు తెలిపారు. 


Read more: Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్.. జనసేనానికి అమిత్ షా సంచలన బాధ్యతలు..?..


ఈ రోజు కూడా బీజేపీ ఎన్సీ నేతల మధ్య తొపులాటలు జరిగాయి. దీంతో మళ్లీ జమ్ము 370 అంశం రాజకీయాల్లో వివాదంగా మారింది.ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీనిపైన భవిష్యత్తులో ఏంజరుగుతుందో అని నేతల్లో ఆందోళన నెలకొందని వార్తలు వస్తున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.