Amreen Bhat: టీవీ నటిని చంపేసిన ఉగ్రవాదులు హతం.. కశ్మీర్ పోలీసుల క్విక్ రియాక్షన్
Amreen Bhat: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జమ్మూ కశ్మీర్ టీవీ నటి , సోషల్ మీడియా ఫేం అమ్రీన్ భట్ హత్య కేసును భద్రతా బలగాలు చేధించాయి. టీవీ నటిని చంపేసిన ఉగ్రవాదులను కొన్ని గంటల వ్యవధిలోనే హతమార్చాయి. అమ్రీన్ భట్ హత్య జరిగిన 24 గంటల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టడం సంచలనంగా మారింది.
Amreen Bhat: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జమ్మూ కశ్మీర్ టీవీ నటి , సోషల్ మీడియా ఫేం అమ్రీన్ భట్ హత్య కేసును భద్రతా బలగాలు చేధించాయి. టీవీ నటిని చంపేసిన ఉగ్రవాదులను కొన్ని గంటల వ్యవధిలోనే హతమార్చాయి. అమ్రీన్ భట్ హత్య జరిగిన 24 గంటల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టడం సంచలనంగా మారింది.
అవంతిపొరాలోని అగన్‌హజిపొరాలో శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రత బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు ఇద్దరిని స్థానిక ఉగ్రవాదులుగా భద్రతా బలగాలు గుర్తించాయి. ఒకరు బుద్గాంకు చెందిన షాహిద్ ముస్తాక్ భట్ కాగా.. మరొకరు పుల్వామాలో హికీంపొరాకు చెందిన ఫర్హాన్ హబీబ్ గా గుర్తించారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులే.. టీవీ నటి అమ్రీన్ భట్ హత్య కేసులో నిందితులని కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. హతమైన ఇద్దరు టెర్రరిస్టుల నుంచి ఏకే 56 రైఫిల్, నాలుగు మ్యాగ్జెన్లు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.హతులు ఇద్దరు ఈ మధ్యేఉగ్రవాదులుగా మారిపోయారని.. అమ్రీన్ భట్ హత్యే మొదటి ఆపరేషన్ అని పోలీసులు తేల్చారు.
శ్రీనగర్‌లోని సౌర ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో గత మూడు రోజుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 10 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు కడతేర్చాయి. ఇందులో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కాగా.. మిగితా ఏడుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు.ఈనెల 25 బుధవారం రాత్రి బుద్రాం జిల్లా చదూరలో టీవీ నటి అమ్రీన్ భట్ తన మేనల్లుడు ఫర్హాన్ జుబైర్‌తో కలిసి ఇంటి బయట ఉండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కాల్పులు జరిగారు. ఈ ఘటనలో అమ్రీన్ భట్ స్పాట్ లోనే చనిపోగా.. ఆమె మేనల్లుడు జుబైర్ తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అమ్రీన్ భట్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యారు.టీవీ సీరియళ్లలోనూ నటించారు.
READ ALSO: RAHUL UK TOUR: సమాధానం చెప్పలేక సారీ.. రాహుల్ ను అంతగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఏంటో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook