Supreme Court: వ్యభిచారం ఓ వృత్తి..వేధించవద్దు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చర్చకు దారి తీసిన సుప్రీం వ్యాఖ్యలు

Supreme Court: వ్యభిచారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనమైన తీర్పు ఇచ్చింది. వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తించింది. అదే సమయంలో అక్రమ రవాణా విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2022, 09:10 AM IST
  • వ్యభిచారం, ఛైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
  • వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తించిన సుప్రీంకోర్టు, కేసులతో వేధించవద్దని పోలీసులకు ఆదేశం
  • మైనర్ ఎవరైనా వ్యభిచార గృహంలో ఉంటే..అక్రమ రవాణాకు నిదర్శనం కాదంటున్న సుప్రీంకోర్టు
Supreme Court: వ్యభిచారం ఓ వృత్తి..వేధించవద్దు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చర్చకు దారి తీసిన సుప్రీం వ్యాఖ్యలు

Supreme Court: వ్యభిచారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనమైన తీర్పు ఇచ్చింది. వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తించింది. అదే సమయంలో అక్రమ రవాణా విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు చర్చనీయాంశంగా మారింది. వ్యభిచారాన్ని ఓ వృత్తిగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందరికీ చట్ట ప్రకారం సమాన రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలు త్రిసభ్య ధర్మాసనం ఈ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 

సుప్రీంకోర్టు ఏం చెప్పింది

వ్యభిచారం కూడా ఓ వృత్తి. వ్యభిచారుల పనిలో కేంద్రపాలిత, రాష్ట్ర పోలీసులు జోక్యం చేసుకూకూడదు. పరస్పర వయోజన అంగీకారంతో వ్యభిచరించే వ్యభిచారులపై పోలీసులు క్రిమినల్ కేసులు చేపట్టవద్దు. వ్యభిచార వర్కర్లకు కూడా చట్టప్రకారం సమాన గౌరవం, సమాన రక్షణ ఉంటుంది. ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడిని గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపే హక్కుంటుంది. ఏదైనా కారణాలతో పోలీసులు ఆ ఇళ్లపై దాడిచేస్తే..అక్కడ వ్యభిచరించే వర్కర్లను అరెస్టు చేయవద్దు. వేధించవద్దు. ఇష్టానుసారం వేశ్యగా మారడమనేది చట్టవిరుద్ధం కానేకాదు. అయితే అదే సమయంలో వ్యభిచార గృహాన్ని నిర్వహించడం మాత్రం చట్ట విరుద్ధం. ఓ వ్యభిచార వర్కర్..వ్యభిచార గృహాల్లో ఉన్నంతమాత్రాన..అక్రమ రవాణాకు గురైనట్టు కాదు. 

ఎందుకు చర్చనీయాంశం

సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వ్యభిచారులపై కేసులు నమోదు చేయవద్దని చెప్పడంతో కేసును ఎలా ముందుకు నడిపించాలనేది ఆసక్తిగా మారింది. వ్యభిచార గృహంలో పట్టుబడినప్పుడు అక్రమ రవాణాకు గురైనట్టు కాదని చెప్పడంతో..ఛైల్డ్ ట్రాఫికింగ్ కేసులకు ఇబ్బంది కలగవచ్చనేది మరో వాదన. ఆర్టికల్ 21 ప్రకారం ఇష్టానుసారం నడుచుకునే హక్కు ఉన్నప్పటికీ..వ్యభిచార గృహాలు నడిపే మాఫియా..దీన్ని ఓ లొసుగుగా మార్చుకుుంటందనే అనుమానాలు వస్తున్నాయి. వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తిస్తే..మరి అధికారికంగా దేశంలో లైసెన్స్ ఇస్తారా అనేది మరో ప్రశ్న.

సుప్రీంకోర్టు 6 ఆదేశాలేంటి

వ్యభిచార వర్కర్లను కాపాడేందుకు సుప్రీంకోర్టు 6 ఆదేశాలు జారీ చేసింది. వ్యభిచారం చేసేవారి ఐడెంటిటీని బహిర్గతం చేయకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మార్గదర్శకాలు జారీ చేసింది. అరెస్టులు, రైడ్స్, రెస్క్యూ ఆపరేషన్లు జరిగినప్పుడు మీడియా ఆ వర్కర్ల ఐడెంటిటీ బహిర్గతం కాకుండా సూచనలు జారీ చేయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2011 జూలై 19న ఈ వ్యభిచారం కేసుల విషయంలో ఏర్పాటైన ప్యానెల్ చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం ఆరు వారాల్లోగా స్పందించాలని సూచించింది. ఒక మైనర్..వ్యభిచార గృహంలో నివసిస్తున్నట్టు లేదా వ్యభిచార వర్కర్లతో కలిసున్నట్టు తేలినంతమాత్రాన...అది ఛైల్డ్ ట్రాఫికింగ్ అని నిర్దారించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. 

Also read: Mamata Banerjee: ఛాన్సలర్‌గా సీఎం మమత..బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News