Jawad Cyclone Effect: జవాద్ తుపాను ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. మరోవైపు రైల్వేశాఖ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. తుపాను నేపధ్యంలో పెద్దఎత్తున రైళ్లు రద్దు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరానికి తుపాను ముప్పు(Cyclone Alert) పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రేపటికి తుపానుగా మారనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ 5వ తేదీ ఉదయం కోస్తాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటవచ్చని అంచనా. ఇప్పటికే ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమై..పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జవాద్ తుపాను నేపధ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఏకంగా 95 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.


రద్దైన రైళ్ల వివరాలివే


డిసెంబర్ 2వ తేదీన అంటే ఇవాళ సిల్చార్ త్రివేండ్రం సెంట్రల్, కన్యాకుమారి-దిబ్రుఘర్, అహ్మదాబాద్-పూరి ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-గౌహతి, త్రివేండ్రం శాలీమార్ రైళ్లు రద్దయ్యాయి. ఇక డిసెంబర్ 3వ తేదీన చాలా రైళ్లు రద్దయ్యాయి. ముఖ్యంగా సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, రాయగఢ్-గుంటూరు ఎక్స్‌ప్రెస్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, సంత్రాగచ్చి-చెన్నై, విశాఖపట్నం-హౌరా ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్‌పూర్ , హౌరా-చెన్నై మెయిల్, భువనేశ్వర్-రామేశ్వరం, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. వీటితో పాటు పూరి-గుణుపూర్, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, పూరి-యశ్వంత్‌పూర్ గరీబ్‌రధ్, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.


మరోవైపు డిసెంబర్ 4వ తేదీన ధన్‌బాద్-అలెప్పీ, జునాఘర్ రోడ్-భువనేశ్వర్, విశాఖ-రాయగఢ్, గుంటూరు-రాయగఢ్, బెంగళూరు-భువనేశ్వర్, ముంబై-భువనేశ్వర్, విశాఖ-కొర్బా, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, చెన్నై-హోరా, యశ్వంత్‌పూర్-హౌరా, యశ్వంత్‌పూర్-హౌరా దురంతో, చెన్నై-భువనేశ్వర్, చెన్నైసెంట్రల్-హౌరా రైళ్లున్నాయి.


డిసెంబర్ 5వ తేదీన కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. ఇందులో భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి నిలయం, హాతియా-బెంగుళూరు, భువనేశ్వర్-విశాఖ, భువనేశ్వర్-సికింద్రాబాద్, గుణపూర్-పూరీ, విశాఖ–నిజాముద్దీన్ సమత ఎక్స్‌ప్రెస్, విశాఖ-కిరండోల్ రైళ్లను రద్దు చేశారు. డిసెంబర్ 5వ తేదీన తుపాను తీవ్రతను బట్టి ఇతర రైళ్లను రద్దు చేసే విషయంపై మరోసారి ఈస్ట్‌కోస్ట్ రైల్వే(East Coast Railway) నిర్ణయం తీసుకోనుంది.


Also read: Gujarat: సముద్రంలో మునిగిన 15 పడవలు..పలువురు మత్స్యకారులు గల్లంతు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook