Jee Main Result Session 2: త్వరలోనే JEE మెయిన్ 2023 సెషన్-2 ఫలితాలు, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి!
Jee Main Result Session 2: త్వరలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించిన JEE మెయిన్ 2023 సెషన్-2 ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈ రిజల్ట్స్‌ను ఎలా చెక్ చేసుకోవాలో, ఇతర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Jee Main Result Session 2 2023: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2023 సెషన్-2 ఫలితాలను తర్వలోనే విడుదల కాబోతున్నాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు jeemain.nta.nic.in విడుదల కానున్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫలితంతో పాటు పర్సంటైల్, ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఏజెన్సీ విడుదల చేస్తుంది. JEE మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13తో పాటు 15, 2023 తేదీల్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఆన్సర్ కీ ఏప్రిల్ 19న విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ సెషన్ 2కి దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఈ ఫలితాల్లో NTA విడుదల చేసిన రిజల్ట్స్ మాత్రమే ఫైనల్..ఏ అభ్యర్థి కూడా రీ-చెకింగ్ మొదలైన వాటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉండవు. JEE మెయిన్ 2023 సెషన్-2 ఫలితాల ఈ రోజు లేదా రేపు విడుదలయ్యే అవకాశాలున్నాయని అధికారిక సమాచారం. అయితే విడుదలకు సంబంధించిన సమాచారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరించలేదు.
Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?
నెగిటివ్, పాజిటీవ్ మార్కులు:
(i) సరైన సమాధానానికి నాలుగు మార్కులు మార్కుల ఇస్తారు.
(ii) తప్పు సమాధానానికి ఒకటి నెగిటివ్ మార్క్.
(iii) ఎలాంటి సమాధానం పెట్టనిదానికి జీరో మార్కులు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:
ముందుగా NTA JEE jeemain.nta.nic.in అధికారిక సైట్‌కి వెళ్లండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న JEE మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
లాగిన్ వివరాలను అందులో నమోదు చేసి.. క్లిక్ చేయండి.
ఇలా చేస్తే మీకు సంబంధించిన ఫలితాలు వస్తాయి.
అయితే మీరు ఈ ఫలితాల పేజీని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook