జియో సరికొత్త ప్రయోగం, వాయిస్ ఓవర్ వైఫై సేవలకు ప్లాన్ రెడీ
టెలీకాం సంచలనం రిలయన్స్ జియో తన ప్రత్యర్ధి కంపెనీలను దెబ్బకొట్టేందుకు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించనుంది. వినియోగదారులకు వాయిస్ ఓవర్ వైఫై సేవలు అందించేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి సమాచారం అందించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు వాయిస్ ఓవర్ వైఫై సేవలు కోసం జియో తన 4జీ ఫీచర్ ఫోన్లలు అవసరమైన మార్పులు చేస్తోంది.
గ్రామీణ వినియోగదారులకు వరం
వాయిస్ ఓవర్ వైఫై సేవలు అందుబాటులోకి వస్తే గ్రామీణ వినియోగదారులకు వరంగా మరనుంది. వాయిస్ ఓవర్ వైఫై సేవల వల్ల సిగ్నల్ తక్కువగా ఉన్న, సరిగా అందని ప్రాంతాల్లోని వినియోగదారులకు కాల్ డ్రాప్స్ బెడద ఉండదు. సమీపంలోని వైఫైని ఉపయోగించుకుని కాల్స్ చేసుకోవచ్చు. సాధారణంగా గ్రామాల్లో సిగ్నలింగ్ సమస్య ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించాలనే టార్గెట్ తో రిలయన్స్ జియో సరికొత్త వాయిస్ ఓవర్ వైఫై సేవలకు ప్లాన్ చేసింది
జియో ఫార్ములా పనిచేసేనా ?
ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు రిలయన్స్ కు ధీటుగా డేటా ఆఫర్లు ప్రవేశపెట్టుడుతున్న విషయం తెలిసిందే. దీంతో జియో దూకుడుకు కళ్లెం వేసినట్లుయింది. పైగా జియోకు గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నలింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని జియో సంస్థ వాయిస్ ఓవర్ వైఫై సేవలను అందుబాటులోకి తెస్తోంది.