Jharkhand Election Result 2024: జార్ఖండ్ ఎలక్షన్ రిజల్ట్స్.. ఆదివాసీ అడ్డాలో పాగా వేసేదెవరో..!
Jharkhand Election Result 2024: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు నెలవైన జార్ఖండ్ రాష్ట్రంలో గత రెండు పర్యాయాలు రాజకీయంగా ఐదేళ్లు అక్కడ ప్రభుత్వం పరిపాలన పూర్తి చేసుకుంది. ఈ సారి 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు మెజారిటీ సీట్లు ఈ రాష్ట్రంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓటర్లు అధికారి పార్టీ షాక్ ఇవ్వబోతున్నారా.. ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని కూటమికి అధికారం అప్పగించనున్నారనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
Jharkhand Election Result 2024: ఆదివాసీల అడ్డాలో విజేతలుగా నిలిచేదెవరు? ఈసారి అధికార సింహాసనంపై కూర్చనె పార్టీ ఏది..? ఝార్ఖండ్‌లో ఈసారి అధికార మార్పడి తథ్యమా.. ? మరోసారి జేఎంఎం నేతృత్వంలోని ఇండి కూటమికి అధికారం అప్పగించబోతున్నారా అనేది మరి కాసేట్లో తేలనుంది. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎం మిషన్‌లలో భద్రపర్చారు. ఎవరికి అధికారం ఇవ్వాలనే దానిపై స్పష్టమైన తీర్పు ఇచ్చారా.. ? మరోసారి కన్ప్యూజన్ చేస్తూ కిచిడీ ప్రభుత్వాన్ని స్వాగతం పలుకుతారా అనేది చూడాలి. ఇక జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సర్వే సంస్థలు బీజేపీ కూటమిదే అధికారం అని చెబుతున్నాయి.
బిహార్ స్టేట్ నుంచి విడిపోయి 2001లో అప్పటి వాజ్ పేయ్ సర్కార్ జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేసారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఫస్ట్ ఫేస్ లో 43 స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగింది. రెండో విడతలో 38 స్థానాలకు 20న ఓటింగ్ పూర్తైయింది. మరికాసేట్లో విజేత ఎవరు..? పరాజితులు ఎవరెనది తేలనుంది. మొత్తంగా ఓటర్లు ఎవరికీ పట్టం అప్పగించరానేది తేలనుంది. ప్రస్తుత ఇండి కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 42, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ 3 చోట్ల బరిలో నిలిచాయి. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 81 సీట్లలో పోటీ చేసింది. ఈ సారి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ తో సానుభూతి పవనాలు వీస్తాయా లేదా అనేది చూడాలి.
జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 సీట్లు రావాలి. అక్కడ జార్ఖండలో బీజేపీ నేతృత్వంలోని కూటమితో పాటు కాంగ్రెస్, జేఎంఎం మరో కూటమిగా ఎన్నికల బరిలో దిగాయి. బీజేపీలోకి బాబులాల్ మరాండీ, చంపాయ్ సోరెన్ ఎలక్షన్ ముందు ఆ పార్టీలో చేరడం వంటివి బీజేపీకి నైతికంగా బలం చేకూరింది. జార్ఖండ్ ఎన్నికల గడువు జనవరి 5న ముగియనుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter