Jharkhand Exit Poll: జార్ఖండ్‌లో అధికార కూటమికి షాక్.. కమలం పార్టీ జోరు
Jharkhand Exit Poll Big Shock To JMM Party: రాజకీయ అస్థిరతకు నెలవైన జార్ఖండ్‌లో ఈసారి గెలిచేదెవరో అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. ఆదివాసీల అడ్డాలో జెండా పాతదెవరో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఈసారి ఎవరి పక్షానో నిలుస్తున్నారో తెలుసుకోండి.
Jharkhand Exit Poll: ఆదివాసీల అడ్డాలో గెలిచేదెవరు? ఈసారి అధికార పీఠంపై ఎవరు కూర్చునేది? ఝార్ఖండ్‌లో ఈసారి అధికారం ఎవరిదనేది కొన్ని రోజుల్లో తెలియనుంది. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎం మిషన్‌లలో భద్రపర్చారు. ఎవరికి అధికారం ఇవ్వాలనేది స్పష్టంగా చెప్పారా? వారి నిర్ణయం ఎటు వైపు ఉందో తెలిపే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారా? లేదా బీజేపీ నేతృత్వంలోని కూటమికి మొగ్గు చూపారా తెలుసుకుందాం.
జార్ఖండ్‌లో..
బిహార్ నుంచి విడిపోయి జార్ఖండ్‌గా ఏర్పడిన ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రెండు విడతలుగా ఎన్నికలు జరగ్గా.. తొలి విడతలో 43 స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగింది. రెండో విడతలో 38 స్థానాలకు బుధవారం ఓటింగ్ నిర్వహించారు. ఈనెల 23వ తేదీన ఓట్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 30, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 42, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి 81 సీట్లలో పోటీ చేసింది.
Also Read: Maharashtra Exit Poll: మరాఠా గడ్డపై మళ్లీ ఆ కూటమిదే అధికారం? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే!
పీపుల్స్ పల్స్
బీజేపీ: 42కు 48 స్థానాలు
ఏజేఎస్‌యూ: 2 నుంచి 5 స్థానాలు
కాంగ్రెస్ పార్టీ: 8 నుంచి 14 స్థానాలు
జేఎంఎం పార్టీ: 16 నుంచి 23 స్థానాలు
ఇతరులు: 6 నుంచి 10 స్థానాలు
యాక్సిస్ మై ఇండియా
ఇండియా కూటమి 54 స్థానాలు
ఎన్డీఏ కూటమి 23 స్థానాలు
టైమ్స్ నౌ
ఎన్డీఏ కూటమి 40 నుంచి 44 స్థానాలు
ఇండియా కూటమి 30-40 స్థానాలు
ఇతరులు 1
చాణక్య
ఎన్డీఏ కూటమి 45 నుంచి 50 స్థానాలు
ఇండియా కూటమి 35 నుంచి 38 స్థానాలు
ఇతరులు 3 నుంచి 5 స్థానాలు
మాట్రిడ్జ్
ఎన్డీయే కూటమి 42-47 స్థానాలు
ఇండియా కూటమి 25-30 సీట్లు
జీ తెలుగు
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జీ మీడియా సరికొత్తగా ఏఐ టూల్‌తో చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో వాస్తవ ఫలితాలకు చేరువగా చెప్పి అందరి దృష్టి ఆకర్షించిన జీనియా జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలపై కూడా అంచనా వేసింది.
జీనియా
ఎన్డీయే కూటమి 40 - 45
ఇండియా కూటమి 20-25
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter