COVID19 నెగెటివ్ వచ్చిన మరుసటి రోజే మంత్రి మృతి!
Haji Hussain Ansari Dies: ఝార్ఖండ్ మైనారిటీ శాఖ మంత్రి హజీ హుస్సేన్ అన్సారీ కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న మరుసటి రోజే జేఎంఎం సీనియర్ నేత మృతిచెందడంతో విషాదం నెలకొంది.
రాంచీ: ఝార్ఖండ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, జేఎంఎం సీనియర్ నేత హజీ హుస్సేన్ అన్సారీ (73) మృతిచెందారు (Haji Hussain Ansari Dies). ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందిన హజీ హుస్సేన్ శనివారం తుదిశ్వాస విడిచారు. కాగా, కొన్ని కొన్ని రోజుల కిందట ఆయన కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడ్డారు. కానీ కరోనా నుంచి కోలుకున్న మరుసటి రోజే గుండెపోటు రావడంతో హజీ హుస్సేన్ హన్సారీ చనిపోవడంతో విషాదం నెలకొంది.
Also Read : COVID19: డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పాజిటివ్
కరోనా పాజిటివ్ అని తేలడంతో కొన్ని రోజుల కిందట ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలో ఆయనకు కోవిడ్19 నెగెటివ్ అని వచ్చింది. దీంతో మంత్రి కరోనాను జయించారంటూ సంతోషించారు. మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అవుతారని పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. కానీ విధి వక్రించింది.
Also Read : CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!
శనివారం హజీ హుస్సేన్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. చికిత్స అందిస్తుండగానే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కరోనాను జయించినా మంత్రి హజీ హుస్సేన్ గుండెపోటుతో మృతిచెందడంపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read : Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe