జియో నెట్ వర్క్  సృష్టించిన సంచలం అందరికీ తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మరో సంచలనాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సారి స్మార్ట్ మొబైల్ ను రంగంలోకి దించింది... అది కూడా ఫ్రీగా ఇస్తానంటోంది. అయితే ముందుగా రూ.1500 డిపాజిట్ చేయాల్సి ఉంది. ఫోన్ బుక్ చేసిన మూడేళ్లకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటోంది. రిలయన్స్  వార్షిక సమావేశంలో  ఆ సంస్థ ఛైర్మన్ ముఖేష్‌ అంబానీ  ఈ విషయాన్ని  ప్రకటించారు. జియో మార్కెట్ వ్యూహం ఎలా ఉన్నప్పటికీ ఇది కష్టమర్లకు వరంగా పరిగణిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుక్ చేసుకోండిలా..


ఆగస్టు 15న జియె ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతానికి ఇది ప్రయోషన్ కోసం మాత్రమే.. కస్టమర్లు బుక్ చేయదల్చుకున్నావారు  ఆగస్టు 24 నుంచి జీయో కంపెనీ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోచ్చు. కీప్ మి పోస్టెడ్ పేరుతో ఒక రిజిస్ట్రేషన్ పేజీ బ్యానర్ గా తన వైబ్ సైట్ లో పొందిపరిచింది. ఈ పేజీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. వ్యక్తిగత ఆప్షన్..బిజినెస్ ఆప్షన్.  వ్యక్తిగత మోడ్ లో ఒక వ్యక్తి ఒక ఫొన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మోడ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మెయిల్ ఐడీ, వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. 


బిజినెస్ మోడ్ లో కూడా ఈ ఫోన్ ను ఎంటర్ ప్రైజ్ యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందులో కాంట్రాక్ట్ నేమ్, కంపెనీ పేరు, పిన్ కోడ్,  పాన్ నెంబర్, ఈ మెయిల్,  ఐటీ కాంటాక్ట్ నెంబర్ తో పాటు ఎన్ని డివైజ్ ను అవసరమో తెలుపుతూ రిజిస్టర్ చేసుకుంటే బల్క్గ్ గా ఆర్డర్లు పొందవచ్చు. అయితే కంపెనీ నియమనిబంధనలను అంగీకరించి సబ్మిట్ నొక్కితే రిజిస్ట్రర్ చేసుకున్నట్లు ఒక మెసేజ్ వస్తోంది. అంతే కాకుండా మీ ఈమెయిల్ ఐడీకి కూడా మెయిల్ పంపిస్తారు. 


ఇదిలా ఉండగా ఫోన్ పొందడానికి ..అప్ డేట్లను తెలుసుకనేందుకు కంపెనీ తన వెబ్ సైట్ లో సమాచారాన్ని ఉంచింది. యుజర్లు ఈ జీయో ఫోన్  బుక్ చేసుకోవడం మిస్ కాకూడదని కంపెనీ స్వయంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతోంది.