Jammu Kashmir: ఉగ్ర సంబంధిత కేసుల దర్యాప్తు జమ్ముకశ్మీర్‌లో కొత్త ఏజెన్సీ
Jammu and Kashmir gets State Investigation Agency: కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (State Investigation Agency) (SIA) ఏర్పాటుకు జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
J-K govt constitutes State Investigation Agency to fasten probe into terror related cases:జమ్ముకశ్మీర్ యంత్రాంగం కొత్త యాంటీ టెర్రరిజం బాడీని ఏర్పాటు చేసింది. కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (State Investigation Agency) (SIA) ఏర్పాటుకు జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ‘స్టేట్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (State Investigation Agency) (ఎస్‌ఐఏ)’ని జమ్ముకశ్మీర్‌లోని పోలీసులతోనే ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రదాడులు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, తప్పుడు ప్రచారాలు చేసి అరెస్టైన వారి కేసులను ఈ ఏజెన్సీ విచారించనుంది.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ), పేలుడు పదార్థాలు, అటామిక్ ఎనర్జీ, యాంటీ-హైజాకింగ్, టెర్రర్ కాన్‌స్పిరసీ, టెర్రర్ ఫైనాన్సింగ్, ఇతర ఉగ్రవాదానికి సంబంధించిన కేసులపై ఎస్‌ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ విభాగానికి సీఐడీ చీఫ్ ఎక్స్ అఫిషియో డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
Also Read : Huzurabad by-poll results live updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయం
జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency)(NIA)సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు..స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (State Investigation Agency) SIA నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇకపై ఉగ్రవాద సంబంధిత కేసులను పోలీసులు నమోదు చేస్తే ఆ సమాచారాన్ని SIAకు అందించాల్సి ఉంటుంది.
ఉగ్ర సంబంధిత కేసుల దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ NIA చేపట్టకపోతే.. ఆ కేసు విచారణపై జమ్ముకశ్మీర్ పోలీస్ యంత్రాంగం, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (State Investigation Agency) చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. కేసు ఎవరికి అప్పగించాలనే విషయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం డీజిపీకే ఉంటుందని స్పష్టం చేసింది.
స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (State Investigation Agency) కి కేసు బదిలీ కాని పక్షంలో ఆ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఎస్ఐఏకు అందిస్తూ ఉండాలని తెలిపింది. అవసరమైతే ఎస్‌ఐఏ (SIA) కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టవచ్చని తెలిపింది. స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి సీఐడీ (CID) విభాగ అధిపతి ఎక్స్-అఫీషియో డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
Also Read : Shyam Singha Roy promo: శ్యామ్ సింగ రాయ్ నుంచి రైజ్ ఆఫ్ శ్యామ్ ప్రోమో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook