Jammu Kashmir: కశ్మీర్‌లోయలో మరో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తొయిబా కమాండర్‌ హతం

Lashkar-e-Taiba Commander Umar Mustaq Khandey Killed: భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో లష్కరే తొయిబా కమాండర్ హతమయ్యాడు. లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్‌ ఖండేతో పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2021, 07:29 PM IST
  • పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతం ద్రంగ్‌బల్‌లో పోలీసులు, భద్రతా దళాల ఆపరేషన్‌
  • లష్కరే తొయిబా కమాండర్ హతం
  • లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్‌ ఖండేతో పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాబలగాలు
Jammu Kashmir: కశ్మీర్‌లోయలో మరో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తొయిబా కమాండర్‌ హతం

Jammu and Kashmir 2 Terrorists Including LeT Commander Umar Mustaq Khandey Killed In Pampore Encounter: జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు గత కొన్ని రోజులుగా భద్రతాదళాలు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతం ద్రంగ్‌బల్‌లో పోలీసులు, భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) కమాండర్ హతమయ్యాడు. లష్కరే తొయిబా కమాండర్ (Lashkar-e-Taiba Commander) ఉమర్ ముస్తాక్‌ ఖండేతో (Umar Mustaq Khandey) పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఇక ఎన్‌కౌంటర్ తర్వాత ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Also Read : Special trains: పండుగకు వెళ్లిన వారి కోసం ఈ నెల 17, 18 తేదీల్లో 12 ప్రత్యేక రైళ్లు

ఈ ఏడాది ఆగస్టులో కశ్మీర్‌ పోలీసులు విడుదల చేసిన టాప్‌ టెన్‌ టెర్రరిస్ట్‌ల (Terrorists) హిట్ లిస్ట్‌లో ఉమర్ ముస్తాక్ ఖండే పేరూ ఉంది. అలాగే ఇటీవల శ్రీనగర్‌లో ఇద్దరు పోలీసులను హత్య చేసిన కేసులోనూ ఉమర్ ముస్తాక్ ఖండే (Umar Mustaq Khandey) నిందితుడిగా ఉన్నాడు. ఇక కశ్మీర్‌ లోయలో నిన్న సాయంత్రం నుంచి ఇది మూడో ఎన్‌కౌంటర్. ఇప్పటి దాకా మొత్తం 13 మంది ఉగ్రవాదులను (Terrorists) మట్టుబెట్టారు. 

Also Read : Sherlyn Chopra : రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిపై కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News