అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్ జిల్లా డూరు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్ జిల్లా డూరు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
అంతకుముందు మార్చి 21న జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు, ఐదుగురు తీవ్రవాదులు మృతి చెందారు. మృతి చెందిన ఐదుగురు జవాన్లలో, ముగ్గురు ఆర్మీకి చెందిన వారు కాగా, ఇద్దరు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. మంగళవారం నలుగురు తీవ్రవాదులు చనిపోగా, ఐదవ తీవ్రవాది మృతదేహాన్ని బుధవారం గుర్తించారు.
మంగళవారం సాయంత్రం (మార్చి 21) జిల్లాలోని హల్మాట్పోరా అటవీ ప్రాంతంలో తుపాకీ దాడి జరిగింది. ఈ దాడిలో మరణించిన పోలీసులను దీపక్ పండిట్ మరియు ముహమ్మద్ యూసఫ్‌గా గుర్తించారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా, అదనపు బలగాలను రప్పించారు. కుప్వారా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన భద్రతా సిబ్బందికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం వ్యక్తం చేశారు.