భారతీయ రైల్వేలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు. త్వరలో రైల్వేలో భర్తీ చేయనున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) 10వేల ఉద్యోగాల నియామక ప్రక్రియలో మహిళలకు 50 శాతం అవకాశం కల్పిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. మహిళలకు మరింత ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ విధానం దోహదపడుతుందని ఆయనన్నారు.  అటు రైల్వేల్లో 13 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని.. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే  విడుదల కానుందని.. ఈ పోస్టులను ఇంటర్వ్యూ లేకుండా కంప్యూటర్ ఆధారంగా పరీక్ష నిర్వహించి భర్తీ చేస్తామని ఆయన వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"త్వరలో విడుదలయ్యే 9500-10000 ఆర్‌పీఎఫ్ జవాన్ల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. 13,000 రైల్వే ఉద్యోగాలు త్వరలో వస్తున్నాయి. వాటిని కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా భర్తీ చేస్తాం. ఇంటర్వ్యూలు ఉండవు" అని గోయల్ ఆదివారం పాట్నాలో జరిగిన ఓ జరిగిన కార్యక్రమంలో అన్నారు.



 


ఇటీవలే దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి సిబ్బంది మొత్తం మహిళలే ఉన్న గూడ్స్ రైలు బయలుదేరిన సంగతి తెలిసిందే.


ఇది కూడా చదవండి: రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్; ఏసీ టికెట్ ధరలను తగ్గించిన రైల్వే శాఖ


1957 కేంద్ర చట్టంలో మొదటిసారిగా ఆర్‌పీఎఫ్‌ను ప్రవేశపెట్టారు. ఈ దళంలో 70,000 మంది జవాన్లు పనిచేస్తున్నారు. ఇది దేశంలో అతిపెద్ద రక్షణ దళాల్లో ఒకటిగా ఉంది.