JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా తాజాగా నరేంద్ర మోడీ క్యాబినేట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ఎరువులు, రసాయనాలు శాక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మోడీ ఫస్ట్ టర్మ్ లో కూడా ఈయన ఇదే పదవి చేపట్టారు. తాజాగా మరోసారి ఈ కీలక బాధ్యతలు స్వీకరించడం విశేషం. తాజాగా రాజ్యసభ పక్ష నేతగా జగత్ ప్రకాష్ నడ్డా నియమించబడ్డారు. గతంలో పెద్దల సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభ పక్షనేతగా ఉన్నారు. తాజాగా ఈయన లోక్ సభకు ఎన్నికయ్యారు. మరోవైపు మోడీ ఫస్ట్ టర్మ్ లో అరుణ్ జైట్లీ రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించారు. తాజాగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను రాజ్యసభ నేతగా నియమితులు కావడం విశేషం. 18వ  లోక్ సభ ప్రారంభమైన మొదటి రోజే జేపీ నడ్డాకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఇయర్ ఫిబ్రవరిలో జేపీ నడ్డా థర్డ్ టర్మ్ పెద్దల సభకు నామినేట్ అయ్యారు. గతంలో సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ అయిన జేపీ నడ్డా.. ఈ సారి గుజరాత్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మూడోసారి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో జేపీ నడ్డాను క్యాబినేట్ లోకి తీసుకున్నారు. ఆయన ప్లేస్ లో త్వరలో కొత్త బీజేపీ అధ్యక్షుడు రానున్నారు. ఈ సారి రేసులో భూపేంద్ర యాదవ్, వసుంధరా రాజే, అనురాగ్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ముగ్గురితో పాటు పలువురు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. జేపీ నడ్డా టర్మ్ ఈ నెలతో ముగియనుంది. అయితే ఈ యేడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు సగం పూర్తయిన తర్వాత కానీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానిక వీలు లేదు. మొత్తంగా వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో బీజేపికి కొత్త సారథి రానున్నారు.


అంతేకాదు 2019 ఎన్నికల్లో అమిత్ షా నేతృత్వంలో ఎన్నికలు జరగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 303 సీట్లు సాధించింది. ఆ తర్వాత 2020లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన జేపీ నడ్డా.. ఆ తర్వాత పూర్తి స్థాయి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అంతేకాదు పార్టీని సంస్థాగతంగా బలంగా చేయడంలో కీ రూల్ ప్లే చేసారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి