న్యూఢిల్లీ: ఓ వర్గానికి చెందిన అమ్మకపుదారుల వద్ద కూరగాయలు కొనవద్దన్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా ఘాటుగా స్పందించారు. ఈ విపత్కర సమయంలో బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే తివారీకి భారతీయ జనతా పార్టీ షో కాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి గాను ఏడు రోజుల్లోగా తన వివరానివ్వాలని కోరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలైన ప్రముఖ నటుడు


ఇదే అంశంపై ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జాతీయ అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేశారని ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్‌తో మాట్లాడిన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇకపై బాధ్యతా రహితమైన వ్యాఖ్యలను బీజేపీ సహించదని, సభ్యులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించవద్దని అధినాయకత్వం సూచిస్తోందని అన్నారు. 


కాగా ఎమ్మెల్యే తివారీ ఇంతకుముందు తన నియోజక వర్గ ప్రజలతో "మీరందరూ గుర్తుంచుకోవాలి. నేను మీకు బహిరంగంగా చెబుతున్నాను. ముస్లిం అమ్మకందారుల నుండి కూరగాయలు కొనకండి”  అనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా తివారీ తాను ఈ వ్యాఖ్యలు కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) నుండి ప్రజలను రక్షించడానికి ముందు జాగ్రత్త చర్యగా తాను అలా చేశానని చెప్పి తనను తాను సమర్థించుకున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..