JSSC Recruitment 2022: 12వ తరగతి ఉత్తీర్ణతతో ప్రభుత్వ ఉద్యోగం... దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే... పూర్తి వివరాలివే...
JSSC Recruitment 2022: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా... కేవలం 12వ తరగతి విద్యార్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల గురించి తెలుసుకోండి...
JSSC Recruitment 2022: జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నుంచి క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 19 జూన్, 2022 వరకు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ jssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 991 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో క్లర్క్ పోస్టులు 964 కాగా, స్టెనోగ్రాఫర్ పోస్టులు 27 ఉన్నాయి.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియ... ముఖ్య తేదీలు :
క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 20, 2022 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులందరూ 19 జూన్ 2022లోపు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. ఫారమ్‌లో తప్పులుంటే జూన్ 26 నుంచి 30 వరకు సవరణ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
విద్యార్హత, వయో పరిమితి :
12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హిందీ, ఆంగ్లంలో టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి... అభ్యర్థులు జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ jssc.nic.inని సందర్శించాలి. ఇక్కడ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌ని పొందుతారు. నోటిఫికేషన్‌లో దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Also Read: IPL Final: ఐపీఎల్ ఫైనల్... ఒకవేళ వర్షం అడ్డుపడితే.. సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే.. విజేత ఎవరంటే..?
Also Read: Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మంది అరెస్ట్.. ఇంటర్నెట్ సేవలపై మరో వారం బ్యాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook