Unparliamentary Words List: పార్లమెంట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు టార్గెట్ చేయడం సహజం. పార్లమెంట్ వేదికగా జరిగే చర్చల సందర్భంగా ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు నేతలు పదునైన పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. పార్లమెంట్ అనేది అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలకు వేదికగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని పదాల వాడకంపై నిషేధం ఉంటుంది. తాజాగా అన్‌పార్లమెంటరీ లిస్టులో మరికొన్ని పదాలు చేరాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'జుమ్లా జీవి'(అబద్దాలకోరు), 'బాల్ బుద్ది' (బుద్ధి తక్కువ), కోవిడ్ స్ప్రెడర్, స్నూప్ గేట్, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత, సిగ్గుచేటు, ద్రోహి, అరాచకవాది, శకుని, తానాషా, తానాషాహి, జైచంద్, వినాశ్ పురుష్, ఖలీస్తాన్, నికమ్మ (దద్దమ్మ), ఖూన్ కీ కేతీ (రక్తపాతం) పదాలను అన్‌పార్లమెంటరీ పదాలుగా పరిగణిస్తూ బుక్‌లెట్ విడుదల చేశారు. ఒకవేళ సభ్యులు ఎవరైనా సభలో ఈ పదాలు ఉపయోగించినట్లయితే.. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.


ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్‌పార్లమెంటరీ జాబితాలో మరిన్ని పదాలను చేర్చి బుక్‌లెట్ విడుదల చేశారు. చట్ట సభల్లో కొన్ని పదాలు, వ్యక్తీకరణలపై నిషేధం విధించే అధికారం రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్‌లకు ఉంటుంది. 


మరోవైపు, ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ పదాలను కూడా నిషేధిత జాబితాలో చేర్చడమేంటని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మండిపడ్డారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తన ప్రసంగంలో ఈ పదాలను వాడుతానని...  తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యం కోసం తాను పోరాడుతానని పేర్కొన్నారు. 


Also Read: MK Stalin Hospitalised: చెన్నై కావేరీ ఆసుపత్రిలో చేరిన సీఎం ఎంకె స్టాలిన్...  


Also Read: Neetu Chandra: పెళ్ళాంగా ఉంటే నెలకు 25 లక్షలు.. దారుణమైన విషయం బయటపెట్టిన నీతూ!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.