Jumping Red signals for ambulance bengaluru traffic police wont fine you details: ప్రస్తుతం రోడ్ల మీద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. జనాలు ఎక్కువగా కార్లను ఉపయోగిస్తున్నారు. సాధారణ, మధ్య తరగతి వారు తప్పనిసరగా కార్లను మెయింటెన్ చేస్తున్నారు. కార్ల వాడకంను చాలా మంది స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫీసులు, బైటకు వెళ్లిన కూడా వాహనాలమీద వెళ్తున్నారు. దీంతో రోడ్ల మీద విపరీతంగా ట్రాఫిక్ నెలకొని ఉంటుంది.దీంతో కేవలం ఒకటి, రెండు కిలో మీటర్ల  దూరం పోవడానికి కూడా గంటల సమయం పడుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Nita Ambani: రెండు చేతులు జోడించి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. వీడియో వైరల్..


అంతేకాకుండా..  మన పరిస్థితి ఇలా ఉంటే.. మెట్రోపాలిటన్ నగరాల సిట్యూవేషన్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సిలికాస్ సిటీ అయిన బెంగళూరులో రోజు రోజుకు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఢిల్లీ నగరంలో గతంలో వాహానాల రద్దీ, పొల్యుషన్ కారణంగా సరి, బేసి విధానంను కూడా కొన్నిరోజుల పాటు పాటించారు. చాలా సార్లు ట్రాఫిక్ సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


కొన్నిసార్లు రోడ్ల మీద ట్రాఫిక్ లలో అంబులెన్స్ లు సైతం ఇరుక్కుపోయి బాధితులు నరక యాతన అనుభవించిన అనేక సంఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. కొందరు ట్రాఫిక్ లలో అంబులెన్స్ లకు రూట్ లను క్లియర్ చేస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం.. అంబులెన్స్ వెనుకాలే స్పీడ్ గా వెళ్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు.


పూర్తి వివరాలు.. 


ట్రాఫిక్ ఫుల్ ఉన్న సమయంలో రెడ్ సిగ్నల్ ఉండగా.. కొన్నిసార్లు అంబులెన్స్ లను వస్తుంటారు. ఈ క్రమంలో వీటిని దారి క్లియర్ చేసే క్రమంలో కొన్ని సార్లు రెడ్ సిగ్నల్ ను సైతం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. కానీ సిగ్నలింగ్ వ్యవస్థకు ఈ వ్యవహరం తెలియదు. అందుకే  అది ట్రాఫిక్ వయోలేట్ చేయగానే వెంటనే ఫోటో తీసేసుకుని చాలన్ విధిస్తుంది. దీంతో చాలా మంది మంచికి పోతే.. జేబుకు బొక్క పడిందని బాధపడుతుంటారు. ఇక మీదట ఇలాంటి వారికి నోటెన్షన్ అని చెప్పవచ్చు. బెంగళూరు పోలీసులు వాహనాదారులకు బంపర్ఆఫర్ ఇచ్చారు.


అంబులెన్స్ కు ట్రాఫిక్ ను క్లియర్ చేసేక్రమంలో..  ఎవరైన సరే వాహనదారులు రెడ్ సిగ్నల్ ను అతిక్రమించిన కూడా టెన్షన్ పడాల్సిన అవసరంలేదని ట్రాఫిక్ అధికారులు భరోసా ఇచ్చారు. ఒక వేళ ఆ సమయంలో ట్రాఫిక్ చలాన్ పడిన కూడా.. వెంటనే ఇన్ ఫాండ్రీ రోడ్ లోని ట్రాఫిక్ మేనేజ్ మెంట్ ఆఫీస్ కు వచ్చి ఆ చలాన్ ను క్యాన్షిల్ చేసుకొవచ్చని ట్రాఫిక్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతేకాకుండా.. అంబులెన్స్ లను ట్రాఫిక్ సిగ్నల్ లు గుర్తించి వాటంతట అవే.. రెడ్ నుంచి గ్రీన్ రంగుకు మారేలా జియో ఫెన్సింగ్ లను ఏర్పాటు చేశామన్నారు.


Read more: Couple photo Shoot: రైల్వే బ్రిడ్జీపైన ఫోటో షూట్.. సడెన్ గా దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..


దాదాపు 80 అంబులెన్స్ లకు పైలెట్ ప్రాజెక్ట్ గా జీపీఎస్ ను అమర్చినట్లు తెలిపారు.  ట్రాఫిక్ నిర్వహణలో సహాయం చేయడం, హిట్ అండ్ రన్, మహిళలపై వేధింపులు మొదలైన వాటినిపై నిరంతరం గస్తీ కోసం రహదారులపై.. మరిన్ని సీసీకెమెరాను ఏర్పాటుచేస్తున్నట్లు కర్ణాటక స్టేట్ పోలీసులు వెల్లడించారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి