Couple photo Shoot: రైల్వే బ్రిడ్జీపైన ఫోటో షూట్.. సడెన్ గా దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..

Rajasthan news: పాలీకి చెందిన దంపతులు ఫోటో షూట్ కోసం బ్రిడ్జీ మధ్యలోకి వెళ్లి నిలబడ్డారు. దూరం నుంచి మరికొందరు వీళ్ల ఫోటోలను, రీల్స్ లను రికార్డు చేస్తున్నారు. ఇంతలో ఒక ట్రైన్ పట్టాల మీద వారివైపుకు వేగంగా వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 15, 2024, 03:49 PM IST
  • కొంప ముంచిన జంట తొందరపాడు..
  • ఫోటో షూట్ చేస్తుండగా షాకింగ్ ఘటన..
Couple photo Shoot: రైల్వే బ్రిడ్జీపైన ఫోటో షూట్.. సడెన్ గా దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..

couple jumps from 90 feet rail bridge during photo shoot in rajasthan pali: ఇటీవల యువత అతిగా ప్రవర్తిస్తున్నారు. ఫోటోషూట్ లు, రీల్స్ ల పిచ్చిలో తమ లైఫ్ ను రిస్క్ లో వేసుకుంటున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి లేని పోనీ పనులు చేస్తున్నారు. ఓవర్ నైట్ లో ఫేమ్ రావడానికి ఏపనైన చేయడానికి వెనుకాడటంలేదు. ఈ క్రమంలో చాలా మంది ఎత్తైన జలపాతాలు, కొండలు, గుట్టల మధ్య రీల్స్ తీసుకుంటూ వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల  కొన్నిరోజుల నుంచి పలు ప్రాంతాలలో భారీగా వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో డ్యామ్ లు, చెరువులు, జలపాతాలు నిండుకుండను తలపిస్తున్నాయి. అదే విధంగా.. కొందరు బోట్ ల మీద ఫోటో షూట్ లు తీసుకుని రిస్క్ లో పడ్డారు.

 

అంతేకాకుండా.. మరికొందరు ఫోటోల మీద కాన్సన్ ట్రెషన్ చేసి, జలపాతాల్లో నుంచి నీళ్లలోకి పడిపోయిన ఘటనలు కొకొల్లలు. మరికొందరు కారును, బైక్ లను నడిపిస్తు ఇష్టమున్నట్లు ఫోటోలు, రీల్స్ లకు ఫోజులు ఇచ్చి  ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా అనేకం జరిగాయి. కొందరు యువత మెట్రోలు, ఎయిర్ పోర్టులు, గుళ్లు ప్రతి చోట కూడా రీల్స్ , వీడియోల పిచ్చిలో ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రీవెడ్డింగ్ షూట్ లలో కూడా కొందరు లేని పోనీ రిస్క్ లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ కోవకు చెందని ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ఒక జంటకు చావుతప్పి కన్నులోట్టపోయిందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్‌లోని పాలీ జిల్లాకు చెందిన రాహుల్ మెవాడా, అతడి భార్య జాహ్నవి ఇటీవల బైక్‌పై ఘోరంఘాట్‌కు వెళ్లారు. అక్కడ ఫోటోలు, రీల్స్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడున్న హెరిటేజ్ రైల్వే బ్రిడ్జీపైన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఫుల్ జోష్ తో రీల్స్ కు ఫోజులు ఇస్తున్నారు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ.. అకస్మాత్తుగా వంతెనపైకి రైలు వచ్చింది. దీంతో, రాహుల్ మెవాడా, జాహ్నవీ భయంతో వణికిపోయారు. ఏంచేయాలో ఒక్కసారిగా అర్ధంకాలేదు.

ముందు నుంచి రైలు.. బ్రిడ్జీ మధ్యలో వీళ్లు, పరిగెడుతామంటే స్పీడ్ గా వస్తున్న రైలు.. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాగైన తమ ప్రాణాలను కాపాడుకోవాలని, ఒక్కసారిగా బ్రిడ్జీపై నుంచి కిందున్న లోయలోకి దూకేశారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరికీ పెద్దగాయాలు అయినా ప్రాణాపాయం మాత్రం తప్పిందని చెప్పుకొవచ్చు. వీళ్లతో పాటుగా.. ఇద్దరు బంధువులు అంతకుమునుపే రైలును చూసి దూరంగా జరిగి అపాయం నుంచి తప్పించుకున్నారు. ఇక రాహుల్‌ వెన్నెముకకు గాయం కావడంతో అతడిని జోధ్‌పూర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అతడి భార్య కాలికి ఫ్రాక్చర్ కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అజ్మీర్ రైల్వే డివిజన్ సీనియర్ కమర్షియల్ డివిజనల్ మేనేజర్ స్పందించారు. భార్యభర్తలను  వంతెనపై చూడగానే అప్రమత్తమైన లోకోపైలట్ రైలుకు బ్రేకులు వేయడంతో వంతెనపై ఆగిందని అన్నారు. అయితే, ఆ జంట మాత్రం భయంతో తొందరపడి కిందకు దూకేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ఇంత అతీ అవసరమా.. అంటూకామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. వామ్మో.. ఇంత రిస్క్ ఎందుకురా బాబు అంటూ కూడా వీళ్లను తిట్టిపోస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x