Supreme Court CJI Justice DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఈ వేడకకు హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ పదవీకాలం  2024 10 నవంబర్ 10వ తేదీ వరకు ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయ పట్టా పొందారు. ఆయన ప్రతిష్టాత్మక హోవార్డ్ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నాడు. 1998 నుంచి 2000 వరకు ఆయన భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా మొదటి నియామకం అయ్యారు. ఆ తరువాత అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు.  


జస్టిస్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. ఆయన తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1978 నుంచి 1985 వరకు 7 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్‌లో ఒక ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన ముఖంలో ఎప్పుడూ మృదువైన చిరునవ్వు ఉంటుంది. పేరున్న లాయర్లతో సమానంగా జూనియర్ లాయర్ల పట్ల కూడా గౌరవంగా వ్యవహరిస్తారు. ఒక కేసును కొట్టివేసేటప్పుడు కూడా మర్యాదపూర్వక స్వరంలో లాయర్‌కి కారణాన్ని వివరంగా వివరిచండం ఆయన ప్రత్యేకత.


కరోనా కాలంలో ఆక్సిజన్, మందుల లభ్యతపై జస్టిస్ చంద్రచూడ్‌ అనేక ఆదేశాలు ఇచ్చారు. ఆయన కరోనా సోకినా కూడా ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఇటీవల రాత్రి 10 గంటల వరకు కోర్టు కార్యకలాపాలు నిర్వహించి.. ఆ రోజు తన ముందున్న కేసులన్నింటినీ పరిష్కరించారు.


జస్టిస్ చంద్రచూడ్ తీసుకున్న నిర్ణయాలు..


ఇటీవల వారు పెళ్లికాని మహిళలకు తమ 20 నుంచి 24 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి జస్టిస్ చంద్రచూడ్ అనుమతించారు. భర్త బలవంతంగా సంభోగంలో పాల్గొని భార్యను గర్భవతిని చేస్తే.. ఆమెకు కూడా 24 వారాల పాటు అబార్షన్ చేసే హక్కు ఉంటుందన్నారు. అబార్షన్ కేసు, చట్టంలో మొదటిసారిగా వైవాహిక అత్యాచారాన్ని గుర్తించారు. అదేవిధంగా ఆర్మీలో పర్మినెంట్ కమీషన్ కోసం చాలా కాలంగా పోరాడుతున్న మహిళా అధికారులకు కూడా జస్టిస్ చంద్రచూడ్‌ ఉపశమనం కలిగించారు. అయోధ్య కేసు తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఆయన కూడా సభ్యుడు. ఆధార్ కేసుపై తీర్పు ఇస్తూ.. ప్రైవసీ ప్రాథమిక హక్కుగా ప్రకటించడంలో కీలక పాత్ర పోషించారు.


Also Read: Internet Speed: ఇంటర్నెట్ స్లోగా ఉందా..? ఈ చిన్న ట్రిక్ పాటించండి  


Also Read: YSRCP: పార్టీ పదవులకు ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై.. వైసీపీలో ఏం జరుగుతోంది..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook