సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేసీ పాల్ మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో ఓ ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన... ఈ సారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పై గురిపెట్టారు.  ఎగ్జిట్ ఫొల్స్ ను పెద్దగా  పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనకున్న సమాచారం మేరకు బీజేపీకి 200 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్పీ,బీఎస్పీలే కీలకం...


ప్రభుత్వ ఏర్పాటులో మమత, అఖిలేశ్‌, మాయావతి వంటి నేతలు ఈ ఎన్నికల్లో కీలకమవుతారని పాల్‌ అభిప్రాయపడ్డారు. వీరి సాయంతో కేంద్రంలో అధికారం చేపట్టవచ్చని పాల్ అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకు మొజార్టీ సీట్లు వస్తాయని చెబుతుండగా ..పాల్ దీనికి భిన్నంగా స్పందించడం గమనార్హం.


ఏపీలో పాల్ ప్లాప్ షో...


ప్రజాశాంతి పార్టీ స్థాపించి ఏపీలో అభ్యర్ధులను బరిలో దించిన పాల్ ..అంతగా ప్రభావం చూపలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నికల ముగిసినప్పటి నుంచి పాల్ కాస్త కామ్ గా ఉంటూ అప్పడప్పుడూ బయటికి వచ్చి ఈసీపై విరుచుపడేవారు. ఇప్పుడు తాజాగా ఢిల్లీలో ప్రత్యక్షమై ఇలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించారు.