'Kacha Badam' Singer Bhuban Badyakar Road Accident: గల్లీలో పల్లీలు అమ్ముకునే ఓ వ్య‌క్తి.. ఒక్క పాట‌తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. అత‌నే పశ్చిమబంగాల్​కు  చెందిన భూబన్ (Bhuban Badyakar )​. 'క‌చ్చా బాదామ్' (Kacha Badam Song) అనే పాట‌తో భూబ‌న్  వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో అతని జీవితం మారిపోయింది. తాజాగా భూబ‌న్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కచ్చాబాదమ్​ పాటతో జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు భూబ‌న్. రెమ్యూనరేషన్ కూడా భారీగా రావడంతో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. డ్రైవింగ్ నేర్చుకునే ప్రయత్నంలో అతడు ప్రమాదానికి (Car Accident) గురయ్యాడు. ఛాతీలో బలమైన గాయం అయింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. భూబ‌న్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ప్రార్థనలు చేస్తున్నారు. 


భూబ‌న్ స్వస్థలం..పశ్చిమ బంగాల్‌లోని (West Bengal) లక్ష్మీనారాయణపూర్‌ కురల్జురీ గ్రామం. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇతడి పల్లీలు అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించే వాడు. ఇకపై పల్లీలు అమ్ముకోనని, సింగింగ్‌ కెరీర్‌లోనే కొనసాగుతానని భూబ‌న్ చెబుతున్నాడు.


Also Read: Viral Video: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపేసిన ఉక్రెయిన్ వాసి, వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి