Ukrainian resistance: ఉక్రెయిన్-రష్యా యుద్ధం (Russia-Ukraine War) ఆరో రోజుకు చేరింది. ఉక్రెయిన్ పై రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఆరో రోజు కూడా బాంబులమోత మోగిస్తోంది. సోమవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో రష్యా భీకరంగా తన దాడులను కొనసాగిస్తోంది. అంతే దీటుగా ఉక్రెయిన్ బదులిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు మోహిరించినట్లు తెలుస్తోంది. సైనిక వాహనాలు, ఫిరంగులు, యుద్ధ ట్యాంకులతో కీవ్ నగరంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు రష్యా సైన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇదిలా ఉంటే...రష్యాకు ఉక్రెయిన్ బలగాల నుంచే కాదు సాధారణ పౌరుల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురువుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని బఖ్‌మాచ్ ( Bakhmach) వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో నిలువరించాడు. అనంతరం ట్యాంక్ పైకి ఎక్కాడు. తర్వాత కిందికి దిగి తన చేతులతో ట్యాంక్ ను నెట్టడానికి ప్రయత్నించాడు. అది వీలు కాకపోవటంతో ట్యాంక్ ముందుకు వెళ్లకుండా ఆపే ప్రయత్నంలో మోకరిల్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.
Also Read: Indian Student killed In Ukraine: రష్యా మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి