కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్‌ అసలు పేరు కమల్ నాథ్ కాదు.. కమిషన్ నాథ్ అని ఆయనకు ఓ కొత్త పేరును సూచించారు మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేత సంబిత్ పాత్రా. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఓ ముస్లిం సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇక్కడి నుంచి 90 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌కి అభివృద్ధి, వికాసాన్ని అందించే కమలం కావాలి కానీ కమిషన్ నాథ్ కాదు అని ఈ సందర్భంగా కమల్ నాథ్‌ని పాత్రా ఎద్దేవా చేశారు.