Kangana Ranaut Freedom 2014ఛ భారత్​కు 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదని.. అది భిక్ష మాత్రమేనని.. 2014లోనే దేశానికి నిజమైన (Freedom 2014) స్వాతంత్ర్యం వచ్చిందని చేసిన వ్యాఖ్యలను నటి కంగనా రనౌత్ మరోసారి సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే.. అందరికీ క్షమాపణలు చెబుతానని, ఇటీవల అందుకున్న పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని (Kangana Ranaut say She will returns Padma sri) ఇన్​స్టా గ్రామ్ స్టోరీస్​లో పోస్ట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"215376","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కంగనా ఇన్​ స్టా స్టోరీ","field_file_image_title_text[und][0][value]":"Kangana insta Story"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కంగనా ఇన్​ స్టా స్టోరీ","field_file_image_title_text[und][0][value]":"Kangana insta Story"}},"link_text":false,"attributes":{"alt":"కంగనా ఇన్​ స్టా స్టోరీ","title":"Kangana insta Story","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇందులో భాగంగా.. సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై వివరణ కూడా ఇచ్చారు కంగనా రనౌత్​.


'మనకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చింది. కానీ భారతీయుల మనస్సాక్షికి మాత్రం 2014లో స్వేచ్ఛ లభించింద'ని ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పినట్లు కంగానా పేర్కొన్నారు. ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, స్వదేశీ వస్తువులను వాడేందుకు ప్రస్తుతం ఎవరూ సిగ్గుపడటం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఎడిట్ చేసిన ఆ వీడియోను పట్టుకుని విమర్శించడం సరికాదన్నారు కంగనా రనౌత్​. ఆ వీడియోలో తాను ఎవరినీ అవమానించలేదని చెప్పుకొచ్చారు.


Also read: Tractor Rally Delhi: ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల పరిహారం


Also read: Ujjain Rape Case: పిల్లల కోసం దారుణం.. యువతిని బంధించి 16 నెలలుగా అత్యాచారం!


కంగనా ఇంకా ఏమన్నారంటే..


1857లో స్వాతంత్ర్య ఉద్యమంం గురించి తనకు తెలుసని.. అయితే 1947లో ఏం జరిగిందో ఎవరైనా చెప్పాలి అంటూ అమె రాసుకొచ్చారు. 1857 తర్వాత జాతీయ వాదం ఎందుకు తగ్గిపోయిందని, భగత్ సింగ్, నేతాజీ సుభాష్​ చంద్రబోస్ లాంటి నేతలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? స్వాతంత్ర్యం తర్వాత ఒకరినొకరు ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది? అంటూ ప్రశ్నించారు.


ఈ విషయాలను ఉద్దేశిస్తూ.. మహాత్మా గాంధీ భగత్​ మరణాన్ని ఎందుకు అడ్డుకోలేదని, బోస్​కు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అని రాసుకొచ్చారు.
తన ప్రశ్నలన్నింటికి సమాధానం చెబితే.. క్షమాపణ చెప్పి.. పద్మశ్రీ వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.


Also read: Watch Video: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం.. ప్రయాణీకులు సేఫ్..


Also read: Norovirus: నిన్న కరోనా..ఈ రోజు నోరో వైరస్..భయం గుప్పిట్లో కేరళ.. లక్షణాలు, చికిత్స


కంగనాపై విమర్శలు..


కంగనా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర దుమారం రేగుతోంది. అధికార బీజేపీ నేతలతో పాటు.. కాంగ్రెస్​, ఇతర పార్టీల నేతలు ఆమెపై తీవ్రంగా మండి పడుతున్నారు.


బీజేపీఎంపీ వరుణ్ గాంధీ కూడా కంగనా రనౌత్​ మాటలను తీవ్రంగా తప్పబట్టారు. ఆమె మాటలను దేశద్రోహంగా బావించాలా? పిచ్చిపట్టి మాట్లాడుతోందని భావించాలా? అని ట్విట్టర్​ ద్వారా పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను కేవలం ఖండిస్తే సరిపోదన్నారు.


దేశప్రజలందరికీ కంగన బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ అన్నారు. ఇటీవల కంగనకు ఇచ్చిన పద్మ అవార్డును వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.


అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేయడానికి ముందే, వాటి కోసం ఎంపికచేసిన వ్యక్తుల మానసిక స్థితిని గమనించాలని కాంగ్రెస్‌ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు.


ఇక సీపీఐ నేత నారయణ కంగనా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంగనా ఓ విలాసవంతమైన బిచ్చగత్తే అంటు తీవ్ర విమర్శలు చేశారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంపై మాట్లాడే అర్హత ఆమెకు గానీ పద్మశ్రీ ఇచ్చిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ (BJP, RSS)లకు కూడా లేదన్నారు.


Also read: Delhi Lockdown News: ఢిల్లీలో పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్.. లాక్ డౌన్ తప్పదా?


Also read: Terror Attack: అసోం రైఫిల్స్ కాన్వాయ్​పై ఉగ్రదాడి...కల్నల్ కుటుంబంతో సహా పలువురు మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook