Ujjain Rape Case: పిల్లల కోసం దారుణం.. యువతిని బంధించి 16 నెలలుగా అత్యాచారం!

Ujjain Rape Case: పదహారు నెలలుగా ఓ యువతిని బంది చేసి రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం ఓ వ్యక్తి, భార్య సహకారంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 09:11 AM IST
  • 16 నెలలుగా యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం
  • సంతానం కోసం భార్య సహకారంతో దారుణం
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Ujjain Rape Case: పిల్లల కోసం దారుణం.. యువతిని బంధించి 16 నెలలుగా అత్యాచారం!

A woman was raped and forced to bear a child by a couple: సంతానం కోసం ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఓ 21 ఏళ్ల యువతిని బందించి 16 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు అతడి భార్య కూడా సహకరించడం గమనార్హం.

తిరా ఓ బిడ్డ‌కి జన్మనిచ్చిన తరువాత బాధితురాలని దగ్గర్లోని ఓ బస్టాప్ దగ్గర వదిలి వెళ్ళారు ఆ దంపతులు.

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో చోటు చేసుకుంది ఈ అమానుష ఘటన.

Also read: Tamilnadu Lady Police: వరద బాధితులను భుజాలపై ఎత్తుకెళ్లిన మహిళా పోలీస్..

Also read: HD Kumaraswamy: 'జన్​ ధన్​ ఖాతాలు హ్యాక్​ చేసి రూ.6 వేల కోట్లు కొల్ల గొట్టారు.. ఈ విషయం ప్రధానికి తెలిసే ఉంటుంది'

పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉజ్జయినీలోని క‌ధ్ బ‌రోడా గ్రామానికి చెందిన ఆ గ్రామ మాజీ ఉప స‌ర్పంచ్ రాజ్‌పాల్ సింగ్, చంద్రకాంత దంపతులు తమకు పుట్టిన పిల్లలను చిన్న వయసులోనే కోల్పోయారు. దీనితో సంతానం కోసం అడ్డదారిని ఆశ్రయించారు.

మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో.. ఓ మహిళ ద్వారా బాధితురాలిని (Human Trafficking) కొనుగోలు చేశారు ఆ దంపుతులు. అమెపై రాజ్​పాల్​ సింగ్ పలు మార్లు అత్యాచారం ల(Ujjain Rape Case) చేశాడు. దీనితో ఆమె గర్భం దాల్చింది. గత నెల 25న ఓ బిడ్డకు జన్మనిచ్చింది (Nagpur Women raped) ఆ యువతి. అయితే ఈనెల 6న ఆపస్మారక స్థితిలో ఉన్న ఆ బాధిత యువతిని దేవాస్​ బస్​స్టాప్​ వద్ద వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు రాజ్​పాల్​ సింగ్​ దంపతులు.

Also read: General Bipin Rawat: 'పాకిస్థాన్​ కంటే చైనాతోనే భారత్​కు ఎక్కువ ముప్పు'

చాలా సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనితో ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఆ దంపతులు, సహా ఇందుకు సహకరించినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజ్​పాల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో పాటు యువతిని విక్రయించిన మహిళ వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇందుకోసం ఓ పోసీల్ బృందాన్ని నాగ్​పూర్ పంపించారు.

రాజ్​పాల్​తో పాటు.. ఇందుకు సహకరించిన అతడి బంధువులు విరేంద్ర పాల్​, అర్జున్​లపై ఐపీసీ సెక్షన్​ 370 (మానవ అక్రమ రవాణా), 376 (అత్యాచారం), 376 ఏ, 365 (కిడ్నాపింగ్), 377 (అసహజ శృంగారం), 506 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Also read: Sabarimala Temple Opening: నవంబరు 16 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం.. భక్తులు పాటించాల్సిన నియమాలివే..

Also read: Covid-19 Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ రద్దు చేయనున్న రైల్వేశాఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News