బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్..  తనపై జరిగిన యాసిడ్ దాడిని గుర్తు చేసుకున్నారు. తనకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఆ ఘటన గుర్తుకు వస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుందన్నారు. యాసిడ్ దాడిలో కాలిపోయిన తన ముఖాన్ని చూసి  తన తల్లితండ్రులు మూర్చపడిపోయేవారని చెప్పారు. ఐతే వారు అహోరాత్రులు తన కోసం, తన వైద్యం కోసం శ్రమించారని ట్వీట్ చేశారు. ముఖ్యంగా తన సోదరి కంగనా రనౌత్ తీసుకున్న శ్రద్దను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాసిడ్ దాడి చేసిన వ్యక్తి పేరు వెల్లడి
మరోవైపు తనపై యాసిడ్ దాడికి పాల్పడ్డ వ్యక్తి పేరు అవినాశ్ శర్మ .. అంటూ చాలా ఏళ్ల తర్వాత నాటి ఘటన గుట్టు విప్పారు రంగోలి చందేల్. అవినాశ్ శర్మ తనతోపాటు ఒకే కాలేజీలో చదివేవాడని తెలిపారు. అంతేకాదు... తమ ఫ్రెండ్స్ లో ఒకడిగా ఉండేవాడన్నారు. కానీ ఏదో రోజు రంగోలిని పెళ్లి చేసుకుంటానని తన ఫ్రెండ్స్ తో చెప్పేవాడని తెలిపారు. తాను మాత్రం ఎప్పుడూ అలాంటి ఉద్దేశంతో చూడలేదని స్పష్టం చేశానని రంగోలి ట్విట్టర్ లో పోస్టు చేశారు. తనకు ఓ ఎయిర్ ఫోర్స్ అధికారితో నిశ్చితార్థం జరిగిందని తెలుసుకుని అవినాశ్.. తనపై యాసిడ్ పోస్తానని బెదిరించినట్లు వెల్లడించింది. ఐతే దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదని .. పోలీసుల వద్దకు వెళ్లలేదని .. జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పు అదేనని రంగోలి ట్విట్టర్ లో ఆవేదనగా రాసుకొచ్చింది. 


'ఛపక్'.. అంతా మారిపోయింది
తాను,  నలుగురు అమ్మాయిలతో ఓ పెయింగ్ గెస్ట్  హౌస్ లో ఉండేదాన్నని .. అప్పుడు ఓ యువకుడు తన కోసం వచ్చినట్లు స్నేహితురాలు విజయ చెప్పిందని తెలిపారు రంగోలి.  తాను తలుపు తెరిచిన తర్వాత ఓ మగ్ లో యాసిడ్ ను పోసేశాడని..  ఆపై ఒక్క సెకనులో  తన జీవితం అంతా తారుమారైందని రంగోలి గుర్తు చేసుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..