Kanjhawala Girl : కారుకు ఏదో తగిలినట్టు అనిపించింది కానీ అందుకే ఆపలేదు.. నిజం ఒప్పుకున్న నిందితులు!
Crucial Information Revealed in Delhi Girl Dragged Case: ఢిల్లీలో జరిగిన ఒక దారుణమైన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Crucial Information Revealed in Delhi Girl Dragged Case: ఢిల్లీలోని కంఝవాలాలో జరిగిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఒక యువతిని కారుతో ఢీ కొట్టి ఆమె మృతదేహాన్ని చాలా దూరం లాక్కుపోవడంతో ఆమె మరణించగా మృతదేహం నగ్నంగా రోడ్డుపై పడి ఉంది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులను దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), కృష్ణన్ (27)గా గుర్తించారు. మిథున్ (26), మనోజ్ మిట్టల్ (27 గా గుర్తించారు. ఇక ఈ కేసులో ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసుల విచారణలో నిందితులు పలు రహస్యాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ తన స్నేహితుడి కారును తీసుకొచ్చి.. తన స్నేహితులు మరో నలుగురితో న్యూ ఇయర్ పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. పార్టీ కోసం ముర్తాల్‌కు వెళ్లాలని ప్లాన్ చేశారు, అయితే ముర్తాల్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో వారికి ఆహారం లభించలేదు. దీంతో వారికి మరో ముగ్గురు తోడయ్యారు, ఆ తర్వాత ఐదుగురు తిరిగి వచ్చారు. ముర్తల్‌కు వెళ్లి వస్తున్న సమయంలో కారులో మద్యం ఉంది, అందరూ తాగుతూనే ఉన్నారు.
వారు తిరిగి వస్తుండగా పీరాగర్హి దగ్గర డిన్నర్ చేశారు. ఆ తరువాత ఆ అందరూ మనోజ్ మిట్టల్‌ను ఇంటికి దింపేందుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న స్కూటీ ఢీకొట్టింది. రాత్రి రెండున్నర గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తర్వాత స్కూటీ కారు ముందు ఉండగా వారు తమ కారును రివర్స్ చేసుకున్నారు. ఆ సమయంలో సదరు యువతి కారులో ఇరుక్కుపోయింది. అప్పుడు వాహనం నడుపుతున్న వ్యక్తి ఏదో ఇరుక్కుపోయినట్లు భావించాడు కానీ మిగిలిన వారు ఏమీ లేదని అనడంతో కారును తప్పించి ముందుకు డ్రైవ్ చేస్తూ వెళ్లాడు.
వారు అలా వెళుతూ ఉండగా వారు మద్యం మత్తులో ఉండడంతో ఏమీ అర్ధం కాలేదు. వాహనం యూ టర్న్ తీసుకునే సమయంలో మిథున్ ఎడమవైపు కూర్చొని ఉండగా, బాలిక చేయి చూడగానే వాహనాన్ని ఆపి చూశారు, అప్పుడు బాలిక మృతదేహం కిందపడిపోయింది. అందరూ దిగి అది చూసి అక్కడి నుంచి భయంతో పారిపోయారు. తాను ఎవరి దగ్గర నుంచి కారు తీసుకున్నానో ఆ వ్యక్తికి ఆ కారును తిరిగి ఇచ్చేసి యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు కానీ ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చెప్పలేదు.
ఇక ఈ విషయాలన్నీ నిందితులు తమ వాంగ్మూలంలో తెలిపారు. ఇక మరోపక్క ఢిల్లీ పోలీసుల నుంచి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. ఈ మొత్తం విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేయగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను పిలిపించి వివరణాత్మక నివేదిక కోరారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్జీ సక్సేనా పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు చెబుతున్నారు.
Also Read: Perni Nani on BRS: ఏపీకి ద్రోహం చేసిన తెలంగాణ నేతలేవచ్చి ఏమి ఉద్ధరిస్తారు?
Also Read: Woman Slits Husband's Throat: ఏపీలో న్యూయర్ విషెష్ చెప్పలేదని భర్త గొంతు కోసిన భార్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook