Perni Nani Sensational Allegations on Telangana Ministers: 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీకి అప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు మధ్య కాస్త సత్సంబంధాలు ఉండేవి. విభజన హామీలు అమలు, అలాగే కొన్ని సరిహద్దు వ్యవహారాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ వీరి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. జగన్ కూడా ఒకటిరెండు సందర్భాలలో ప్రగతి భవన్ కి వచ్చి వెళ్లారు.
అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి అప్గ్రేడ్ అయిన తరువాత మాత్రం కాస్త దూరం పెరిగినట్లుగానే కనిపిస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, పార్థసారథి వంటి వారు వచ్చి బీఆర్ఎస్ కండువాలు కప్పుకోవడమే కాక తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తారని ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలంగాణ నాయకత్వం మీద విమర్శల వర్షం మొదలుపెట్టారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పేర్ని నాని తెలంగాణ మంత్రులు ఏపీ వచ్చి ఏమి ఉద్ధరిస్తారు అని ప్రశ్నించారు.
తెలంగాణ వారు శ్రీశైలం నుంచి దొంగ కరెంటు తీసుకుంటున్నారని విమర్శించిన ఆయన కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారని ఇప్పుడు బిఆర్ఎస్ పోటీ చేస్తే అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇక మరోపక్క తెలంగాణ మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించిన పేర్ని నాని మోడీ, అమిత్ షా ఎప్పుడు వస్తారో అని వారంతా భయంతో ఉన్నారని అన్నారు. ఇక ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనని పేర్కొన్న ఆయన వారే వెన్నుపోటు పొడుస్తున్నారని ఏపీకి చెందిన ఆస్తులు పంచారా? విభజన తరువాత రావాల్సిన డబ్బులు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
ఇక మరోపక్క 10, 20 అడుగుల రోడ్లలో మీటింగ్లు పెట్టుకుని జనాలు వచ్చారని చెప్పుకోవడం చంద్రబాబుకు పట్టిన కర్మగా అభిమానించిన పేర్ని నాని చంద్రబాబు గ్రాఫిక్స్ డ్రోన్ షాట్స్ కు బాగా అలవాటు పడిపోయారని అన్నారు. అలాగే లోకేష్ కు తండ్రి మీద నమ్మకం లేదని అందుకే లోకేష్ పాదయాత్ర పోస్టర్లో చంద్రబాబు ఫోటో కూడా వేసుకోలేదని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచినట్టే లోకేష్ కూడా తండ్రికి వెన్నుపోటు పొడిచి అతని స్థానం లేకుండా చేయాలని చూస్తున్నాడని అన్నారు. తండ్రికి కొడుకు మీద కంటే దత్తపుత్రుడు మీద నమ్మకం ఎక్కువ అంటూ పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా ప్రస్తావించిన ఆయన వావి వరుసలు లేకుండా ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన జగన్ ను ఢీకొట్టలేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Also Read: Bairi Naresh Remand Report: బైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. కుట్రపూరితంగానే అయ్యప్పపై వ్యాఖ్యలు!
Also Read: Myron Mohit Remand Report: హీరోయిన్ భర్త రిమాండ్ రిపోర్టులో సంచలనం.. షారుఖ ఖాన్ కొడుకు కేసులో కూడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook