కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో మోడల్ టౌన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కపిల్ మిశ్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో మోడల్ టౌన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కపిల్ మిశ్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఫ్రిబ్రవరి 8 న ఇండియా- పాకిస్తాన్ కు యుద్ధం జరగబోతోందంటూ కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. అంతే కాదు రెండు రోజులపాటు ఆయనపై ప్రచార నిషేధం విధించింది.
మరోవైపు ప్రచార నిషేధం గడువు పూర్తి కావడంతో ఢిల్లీ ఎన్నికల ప్రచార బరిలోకి మళ్లీ దిగిన కపిల్ మిశ్రా .. తనదైన శైలిలో ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. మరో ట్వీట్ తో మరోసారి రాజకీయ వేడి రగిలించారు. ఈసారి ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మార్చాలని ప్రతిపాదించారు. ఢిల్లీ ఎన్నికలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలకు అడ్డాగా వాడుకుంటున్నాయని విమర్శించారు. దీంతో ఆగకుండా ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ముస్లిం లీగ్ గా మార్చాలంటూ ట్వీట్ చేశారు. దీంతో మరోసారి కపిల్ మిశ్రా వార్తల్లోకి వచ్చారు.
ఐతే దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా స్పందించలేదు. ఒకవేళ వారు మళ్లీ ఈసీని ఆశ్రయిస్తారా .. ? అప్పుడు ఈసీ దీనిపై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.