Minister Nagaraju Assets: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఓ రేంజ్‌లో జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు తలమునకలవుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో ఒకే దశలో మే 10న పోలింగ్ జరగనుంది. 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దేశంలోని అత్యంత ధనిక రాజకీయ నాయకులలో ఒకరిగా ఉన్న కర్ణాటక మంత్రి ఎమ్‌‌టీబీ నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.1,609 కోట్లుగా ప్రకటించారు. బెంగళూరు శివార్లలోని హోస్కోట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అధికార పార్టీ బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన ఎన్నికల అఫిడవిట్‌లో వ్యవసాయం, వ్యాపారంగా తన వృత్తిగా పేర్కొన్నారు. తన భార్య ఎం.శాంతకుమారికి రూ.536 కోట్ల విలువైన చరాస్తులను  ఉన్నాయని.. ఇద్దరి స్థిరాస్తుల విలువ రూ.1,073 కోట్లుగా వెల్లడించారు. ఇద్దరి పేరుపై రూ.98.36 కోట్ల లోన్లు ఉన్నాయని ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగరాజు 2020 జూన్‌లో శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తన భార్యతో కలిసి దాదాపు రూ.1,220 కోట్ల ఆస్తులను ప్రకటించారు. 9వ తరగతి వరకు చదివిన నాగరాజు (72) తనకు వ్యవసాయం, ఇంటి ఆస్తులు, వ్యాపారం, ఇతరత్రా ఆదాయ వనరులు, తన భార్య ఇంటి ఆస్తి, ఇతర వనరుల వివరాలను అఫిడవిట్‌లో వివరించారు. 


2018లో జరిగిన విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎన్‌టీబీ నాగరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో నామినేషన్ సమర్పించిన సమయంలో తన ఆస్తి రూ.1,120 కోట్లుగా ప్రకటించారు. ఆ తరువాత జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి బీజేపీకి మద్దతిచ్చిన 17 మంది ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరు. బీజేపీలో చేరిన తరువాత 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఈ సందర్భంగా తనకు రూ.1,220 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోగా.. విధాన పరిషత్తుకు ఎన్నికై మంత్రిగా పదవి పొందారు. 2018 నుంచి ఐదేళ్లతో మంత్రి నాగరాజు ఆస్తులు రూ.500 కోట్ల వరకు పెరిగింది.


Also Read: Virat Kohli: సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ.. మ్యాచ్‌ ఫీజులో కోత.. ఎందుకంటే..?


అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 10 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి తమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ టెంగింకైని పోటీకి దింపింది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్‌ను నిరాకరించింది. దీంతో బీజేపీకి రాజీనామా చేసిన జగదీష్ శెట్టర్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారు.


Also Read: OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్‌ అమలుకు నోటిఫికేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook