కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మే 12 న ఓటింగ్, అదే నెల 15వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్ మాట్లాడుతూ, కర్నాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయన్నారు. మే 12వ తేదీ ఎన్నికలు జరుగుతాయని.. అదే నెల 15వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని మీడియా సమావేశంలో చెప్పారు. ఏప్రిల్ 17న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఏప్రిల్ 24 నామినేషన్లకు చివరి గడువు అని తెలిపారు. ఏప్రిల్ 24 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.


ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ప్రతిపక్ష బీజేపీకి, అధికార కాంగ్రెస్ మధ్య ఉండనుంది. ఎన్నికల ప్రకటన వెలువడటంతో కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 4 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం 56,696 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు కమిషన్ తెలిపింది. పోలింగ్‌లో ఈవీఎంలకు వీవీపీఏటీ యంత్రాలను వినియోగిస్తామని ఈసీ పేర్కొంది.