బలపరీక్షకు ఒక్క రోజు ముందు సీఎం యడియూరప్పకు షాక్ ఇచ్చిన స్పీకర్ !!
కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రి యడియూరప్ప బలపరీక్షకు ముందురోజు కర్నాటక రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. రెబల్ ఎమ్మెల్యేలపై వేటూ వేస్తూ స్పీకర్ రమేష్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత వారం ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన ఆయన.. ఈ రోజు 14 మందిని బర్త్‌రఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బలపరీక్షలో కుమార స్వామి ప్రభుత్వం పతనమైన మరుసటి రోజే స్పీకర్ ముగ్గురి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా వేటుతో ఈ సంఖ్య 17కు చేరింది. వేటు పడిన వారిలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ సభ్యులు ఉన్నారు.
వేటు పడిన ఎమ్మెల్యేలు జాబితా ఇదే !!
స్పీకర్ తన విచక్షాణాధికారన్ని ఉపయోగించి 14 మందిని బర్త్‌రఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బర్తరఫ్ అయిన జాబితాలో ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివరామ్ హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్, బీఈ బసవరాజు, ఆనంద్ సింగ్, ఆర్ రోషన్ బేగ్, మునిరత్న, కే. సుధాకర్, ఎంటీబీ నాగరాజు, ఏహెచ్ విశ్వనాథ్, కే గోపాలయ్య, నారాయణ గౌడ, శ్రీమంత్ పాటిల్ ఉన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను రేపటి నుంచి శాసనసభకు అనుమతించబోమని రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. 2023 ఎన్నికల వరకు వీరు పోటీ చేసే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు.
బలపరీక్షలో యడియూరప్ప గట్టేకేనా ?
రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాసపరీక్షలో ఈజీగా గట్టేక్కవచ్చనే బీజేపీ ధీమాగా ఉన్న సమయంలో స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ఫాక్ కు గురిచేసింది. తాజా పరిణామం ముఖ్యమంత్రి యడియూరప్పకు డైలమాలో పడేసింది. 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. బల నిరూపణకు కావల్సిన బలం 105. భాజపాకి 105మంది సొంత పార్టీ సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఓకే ..లెక్క కాస్త అటూ ఇటూ అయితే మాత్రం యడియూరప్ప సర్కార్ కు తిప్పలు తప్పవన్న మాట. తాజా పరిణామంలో కర్నాటక రాజకీయాలు ఉత్కంఠతంగా మారాయి.