Rameshwaram Cafe Blast Key Conspirator Arrested By NIA: కర్ణాటకలోని బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో మార్చి 1 న మధ్యాహ్నాం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగినప్పుడు కేఫ్ లో వందల మంది కస్టమర్లు ఉన్నారు. ఒక వ్యక్తి పార్శీల్ కోసం వచ్చి, పేలుడు పదార్థం ఉన్న కవర్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన కొద్దిసేపటికే రెస్టారెంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ క్రమంలో పేలుడు సంభవించగానేహోటల్ లో ఉన్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.పేలుడు సంభవించిన ఘటనపై పలువులు కీలక నేతలు దీనివెనుకాల ఉగ్రకుట్ర ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?


వెంటనే..రెస్టారెంట్ తో పాటు, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడి కదిలికను గుర్తించారు. ఎన్ఐఏ ప్రత్యేక బృందాలు కర్ణాటకలో 12, తమిళనాడులో 5, ఉత్తరప్రదేశ్‌లో 18 ప్రదేశాలలో  అణువణువు జల్లెడపట్టారు.  ఈ కేసులో ఇద్దరు నిందితులకు సాంకేతిక సమాచారం ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఘటనకు సహాకరించిన ముజమ్మిల్ షరీఫ్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.


మార్చి 3న ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ.. పేలుడుకు పాల్పడిన ప్రధాన నిందితుడు ముస్సావిర్ షజీబ్ హుస్సేన్‌ను ముందుగా గుర్తించింది. ఇతర కేసుల్లో ఏజెన్సీకి కావాల్సిన మరో కుట్రదారుడు అబ్దుల్ మతీన్ తాహాను కూడా గుర్తించింది. ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. అబ్దుల్ మతీన్ తాహా 2020 నుండి కనిపించకుండా పోయాడు. ముస్సావిర్ షజీబ్ హుస్సేన్ కేఫ్‌లో ఐఇడి ఉన్న బ్యాగ్‌ను వదిలి వెళ్లాడని అధికారులు భావిస్తున్నారు. అంతకుముందు, నిందితుడిని గుర్తించడానికి NIA ప్రజల సహాయం కోరింది. నిందితుడి ఆచూకీ తెలియజేస్తే పదిలక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.


Read MOre: Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..


ఈ కేసులో బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కూడా ఉగ్రవాద నిరోధక సంస్థకు సహకరిస్తోంది. ప్రధాన నిందితుడిని గుర్తించేందుకు వీలుగా పలు వీడియోలు, చిత్రాలను కూడా షేర్ చేసింది. ముగ్గురు నిందితుల ఇళ్లతో పాటు ఇతర అనుమానితుల నివాస స్థలాలు, దుకాణాలపై ఈరోజు దాడులు నిర్వహించారు. సోదాల్లో నగదుతోపాటు పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook