Karnataka Water Crisis: నా ఇంట్లోనే బోర్ ఎండిపోయింది ఏం చేయమంటారు!.. నీటికోరతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం..
Deputy CM DK Shivakumar: కర్ణాటకలో కరువు శివతాండవం చేస్తుంది. నీళ్లు లేక కర్ణాటక వాసులు అలమటిస్తున్నారు. దీంతో అక్కడ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Karnataka Deputy CM DK ShivaKumar On Water Crisis: సమ్మర్ రాక ముందే కర్ణాటకలో నీటి ఎద్దడి రచ్చ జరుగుతుంది. ఇప్పటికే బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాలలో బోర్లు , బావులు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో ప్రజలు ఎంతో కష్టాలను అనుభవిస్తున్నారు. కనీసం తాగు నీటి కోసం కూడా నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఏప్రిల్ , మే నెలలు కూడా రాకముందే ఇలాంటి పరిస్థితి ఏంటని కర్ణాటక వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల ప్రజలు ట్యాంకులతో నీళ్లు తెప్పించుకున్నారు. ఇక.. ఇదే చాన్స్ గా భావించిన ప్రైవేటు ట్రాక్టర్, నీళ్ల లారీల వాళ్లు.. అందిన కాడిని దండుకున్నారు.
కొన్ని చోట్ల నీళ్ల ట్యాంకులకు ఐదువందల నుంచి మూడు వేల వరకు కూడా వసూలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల.. ఇంకా అధికంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎంతగా చెప్పిన కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కర్ణాటకలో కొనసాగుతున్న నీటి ఎద్దడిపై డిప్యూటీ సీఎం సీఎం శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారాయి. నీటి ఎద్దడిపై ఆయన మాట్లాడుతూ.. నా ఇంట్లో కూడా బోర్ ఎండిపోయింది.. ఏం చేయమంటారంటూ సెటైరీక్ గా మాట్లాడారు. దీనిపై చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Read More: Pragya Jaiswal Bikini Pics: బికినీలో బ్లాస్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్.. మరి ఇంతలానా..!
పట్టణాలకు ఉన్న 15 కిలో మీటర్ల పరిధిలో ఉన్న వనరులను ఉపయోగించుకుని, నీటి ఎద్దడి తీర్చాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 30 వేల బోర్లు ఎండిపోగా తన ఇంట్లోనే బోర్ ఎండిపోయిందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పడం గమనార్హం. అదే విధంగా.. రామనగర, హోస్ కోట్, మాగాడి పట్టణాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తిగా సమ్మర్ ప్రారంభంకాకముందే ఇదేంటనీ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook