Karnataka Cabinet: కర్ణాటక పూర్తి కేబినెట్ ఇదే.. డీఏ శివకుమార్‌కు ఏ శాఖ ఇచ్చారంటే..?
Karnataka Ministers Portfolio: కర్ణాటక సీఎం సిద్దరామయ్య టీమ్ రెడీ అయింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో కలిపి మొత్తం 34 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం 24 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులకు ముఖ్యమంత్రి శాఖలు కేటాయించారు.
Karnataka Ministers Portfolio: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం సిద్ధరామయ్య కేబినెట్‌లో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది. మంత్రులు అందరికీ నేడు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య 34కి చేరింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బెంగళూరు నగరాభివృద్ధి, నీటిపారుదల శాఖ అప్పగించారు. ఆర్థిక, మంత్రివర్గ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, వ్యక్తిగత, పరిపాలనా సంస్కరణలు, సమాచార శాఖలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన వద్దే ఉంచుకున్నారు. కీలకమైన హోంశాఖ జి.పరమేశ్వరకు దక్కింది. కేఏ మినియప్పకు న్యాయం, పార్లమెంటు వ్యవహారాలు, ఎస్‌హెచ్‌కె పాటిల్‌కు ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగించారు.
మే 20న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా, మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం మరో 24 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. ఎంసీ సుధాకర్, మంకుల్ వైద్య, చెలువరాయ స్వామి, డి.సుధాకర్, మధు బంగారప్ప, లక్ష్మీ హెబ్బాల్కర్, బి.నాగేంద్ర, శివరాజ్ తంగడి, బైరతి సురేష్, హెచ్‌సీ మహదేవరప్ప, కె.వెంకటేష్, కేఎన్ రాజన్న, సంతోష్ లాడ్, రహీం ఖాన్, ఈశ్వర్ ఖండ్రే, కృష్ణ బైరే, గౌడ, దినేష్ గుండూరావు, జమీర్ అహ్మద్ ఖాన్, బీజెడ్, రామలిమగా రెడ్డి, ప్రియాంక ఖర్గే, సతీష్ జార్కిహోళి, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, జి.పరమేశ్వర తాజాగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కొత్త మంత్రులు, వారి శాఖల వివరాలు ఇలా..
==> సీఎం సిద్ధరామయ్య- ఆర్థిక, పరిపాలనా సంస్కరణలు, సమాచార శాఖ, ఇతరులకు కేటాయించని శాఖలు
==> డిప్యూటీ సీఎం డీకే శివకుమార్- జలవనరులు, బెంగళూరు అభివృద్ధి
==> డాక్టర్ జి.పరమేశ్వర్- హోం శాఖ
==> ఎంబీ పాటిల్- భారీ, మధ్య తరహా పరిశ్రమలు
==> మునియప్ప- ఆహార, పౌర సరఫరాల శాఖ
==> కేజే జార్జ్- ఇంధనం
==> జమీర్ అహ్మద్- హౌసింగ్, వక్ఫ్ బోర్డు
==> రామలింగారెడ్డి- రవాణా
==> సతీష్ జారకిహోళి - పబ్లిక్ యుటిలిటీ
==> ప్రియాంక్ ఖర్గే- గ్రామీణాభివృద్ధి & పంచాయత్ రాజ్,
==> హెచ్‌కే పాటిల్- న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు
==> కృష్ణ భైరగౌడ- రెవెన్యూ
==> చెలువరాయస్వామి- వ్యవసాయం
==> కె.వెంకటేష్- పశుపోషణ, సెరికల్చర్
==> డా.మహదేవప్ప- సాంఘిక సంక్షేమం
==> ఈశ్వర ఖండ్రే- అడవి
==> కేఎన్ రాజన్న- సహకారం
==> దినేష్ గుండూరావు- హెల్త్, కుటుంబ సంక్షేమం
==> శరణ్ బసప్ప దర్శనపుర - చిన్న తరహా పరిశ్రమ
==> శివానంద పాటిల్- టెక్స్‌టైల్స్, చక్కెర
==> ఆర్‌బీ తిమ్మాపుర- ఎక్సైజ్, ముజరాయి
==> ఎస్ఎస్ మల్లికార్జున- మైనింగ్, హార్టికల్చర్
==> శివరాజ తంగడగి- వెనుకబడిన తరగతుల సంక్షేమం
==> డా.శరణ్ ప్రకాష్ పాటిల్ - ఉన్నత విద్య
==> మంకాలే వైద్య - ఫిషరింగ్
==> లక్ష్మీ హెబ్బాల్కర్- స్త్రీ, శిశు సంక్షేమం
==> రహీమ్ ఖాన్ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
==> డి.సుధాకర్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్
==> సంతోష్ లాడ్ - కార్మిక ఖాఖ
==> భోస్రాజ్ - మైనర్ ఇరిగేషన్
==> భైరతి సురేష్ - పట్టణాభివృద్ధి
==> మధు బంగారప్ప - ప్రాథమిక, మాధ్యమిక విద్య
==> డా.ఎంపీ సుధాకర్ - వైద్య విద్య
==> బి.నాగేంద్ర - యువజన సేవలు, క్రీడల శాఖ
Also Read: Palnadu Murder Case: కుమారుడి తల నరికిన తండ్రి.. ఊరంతా తిరుగుతూ హల్‌చల్
Also Read: MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. అప్పటివరకు నో అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి