MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. అప్పటివరకు నో అరెస్ట్

MP Avinash Reddy Latest News: బుధవారం వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. బుధవారం ముందస్తు బెయిల్‌పై తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది.  

Written by - Ashok Krindinti | Last Updated : May 27, 2023, 03:06 PM IST
MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. అప్పటివరకు నో అరెస్ట్

MP Avinash Reddy Latest News:

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బుధవారం తీర్పు వెల్లడిస్తామని.. అప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అవినాష్ తల్లి అనారోగ్యం దృష్ట్యా అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సూచించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తీర్పు బుధవారం రానుంది.     అంతకుముందు మూడు వర్గాలు న్యాయమూర్తి వాదనలు వినిపించాయి.

వెకేషన్ బెంచ్ జస్టిస్ ఎం.లక్ష్మణ్ న్యాయమూర్తి శనివారం మరోసారి వాదనలు కొనసాగాయి. శుక్రవారం ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ సునీతా లాయర్ల వాదనలు విన్న న్యాయమూర్తి.. నేడు సీబీఐ లాయర్ల వాదనలు విన్నారు. సీబీఐ తరఫున వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనిల్‌.. వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా.. అవినాష్ రెడ్డి ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నారని అన్నారు. వైఎస్ వివేకా హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందని.. దీనివెనుక రాజకీయ కారణముందన్నారు. దర్యాప్తుకు అవినాష్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. దర్యాప్తు తమ పద్ధతి ప్రకారమే చేస్తామని.. అవినాష్ రెడ్డి కోరుకున్నట్లు కాదన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎంతో మందిని విచారించామని.. కొందరిని అరెస్ట్ చేశామని చెప్పారు. వారందరికీ లేని ప్రత్యేక పరిస్థితి అవినాష్ రెడ్డికి ఏమిటి..? కోర్టులో రకరకాల పిటిషన్లు వేస్తూ దర్యాప్తు జాప్యం చేస్తున్నారని వాదించారు.

ఈ సందర్భంగా సీబీఐని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. లోక్‌సభ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని అనధికారికంగా ముందే ప్రకటించారని స్టేట్‌మెంట్ చెబుతోందని.. అందరూ ఆయన అభ్యర్ధిత్వాన్ని సమర్ధిస్తున్నట్లు స్టేట్‌మెంట్స్ ఉన్నాయి కదా..? అని ప్రశ్నించింది. వివేకా హత్యకు ప్రధాన కారణమేంటి..? అని సీబీఐను న్యాయమూర్తి అడిగారు. సీబీఐ బదులిస్తూ.. రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణమని కోర్టుకు తెలిపారు. హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర జరిగిందని.. ఎంపీ అవినాష్‌ రెడ్డి కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయని చెప్పారు. కడప పార్లమెంట్ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారని.. అందుకే వివేకాపై అవినాష్ రెడ్డి రాజకీయంగా పైచేయి సాధించాలని అనుకున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి కుట్ర జరిగిందని అన్నారు. 

వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు..? వారి నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా..? అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వివేకా హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని ఎలా చెబుతున్నారు..? గదిలో రక్తం తుడిచేస్తే అది ట్యాంపరింగ్ ఎందుకు అవుతుంది..? శరీరంపై గాయాలుంటాయి కదా అని అడిగింది. అవినాష్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారా..? కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏంటి అని ప్రశ్నించారు. సీబీఐ వాదనలకు ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి తరఫు న్యాయవాది రిప్లై వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకా ఓడిపోతే.. అవినాష్ రెడ్డి ఏంటి సబంధం..? అని అడిగారు. ఓటర్లు ఓట్లు వేయకపోవడంతోనే ఆయన ఓడిపోయారని అన్నారు. వాదనలు విన్న అనంతరం ఈ నెల 31 తీర్పును వెల్లడిస్తామని.. అప్పటివరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం మధ్యంతరం ఉత్వర్వులు జారీచేసింది. దీంతో బుధవారం వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అస్కారం లేదు. బుధవారం ముందస్తు బెయిల్‌పై హోకోర్టు తీర్పుని బట్టి సీబీఐ చర్యలు తీసుకోనుంది.

Also Read: Palnadu Murder Case: కుమారుడి తల నరికిన తండ్రి.. ఊరంతా తిరుగుతూ హల్‌చల్  

Also Read: GT vs MI Highlights: నెట్‌ బౌలర్‌ టు మ్యాచ్ విన్నర్.. మోహిత్ శర్మ వాట్ ఏ బౌలింగ్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x